పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం ధర ఎంత ఉందంటే

పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం ధర ఎంత ఉందంటే

Today Gold And Silver Price On Aug 14th 2023
టైటిల్‌:

 

థంబ్‌:

పసిడి ప్రియులకు అలర్ట్‌….

గత రెండు వారాలుగా బంగారం ధర దిగి వస్తుండటం.. గోల్డ్‌ కొనాలనుకునేవారికి ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధిగి వస్తుండటంతో.. దేశీయంగా కూడా పసిడి రేటు తగ్గుతోంది. ఇక త్వరలోనే శ్రావణ మాసం ప్రారంభం అవుతుండటంతో.. పండగలు, శుభకార్యాలు మొదలవుతాయి.. దానికి తగ్గట్టే.. బంగారానికి గిరాకీ పెరుగుతుంది. ప్రస్తుతం గోల్డ్‌ రేటు దిగి వస్తోంది కనుక.. ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇక గత వారం రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర.. నేడు స్థిరంగా కొనసాగుతోంది. ఇక గోల్డ్‌ రేటు ప్రస్తుతం కనిష్టాల్లో కొనసాగుతోంది. 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర 60వేల రూపాయలకు దిగువనే ఉంది. మరి నేడు హైదరాబాద్, ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం గోల్డ్ రేటు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గత వారం రోజులుగా దిగి వస్తోన్న బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో క్రితం సెషన్‌ ధరే కొనసాగింది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 54, 650 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 59,620 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే నేడు అనగా సోమవారం గోల్డ్‌ రేటు స్థిరంగా ఉంది. నేడు హస్తినలో22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 54,800 పలుకుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 59,760 వద్ద ఉంది.

స్థిరంగా వెండి రేట్లు..

గత వారం రోజులుగా వెండి కూడా బంగారం బాటలోనే దిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక గత మూడు రోజులుగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుండగా.. నేడు కూడా అదే విధంగా ఉంది. ప్రస్తుతం మన హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 76, 200 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే నేడు కిలో వెండి ధర రూ. 73 వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఈ ఆగస్టు నెల ప్రారంభం నుంచే బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. అయితే క్రితం సెషన్‌లో బంగారం రేటు కాస్త పెరిగినట్లు కనిపించినా ఇవాళ స్థిరంగా ఉండడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

Show comments