Video: లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఓ కుటుంబం బలి!

నేటికాలంలో ఏ విషయంలోనైనా నిర్లక్ష్యంగా ఉండే వారు ఎక్కువగా ఉన్నారు. ఇలా కొందరి సోమరితనం కారణంగా ఇతరులు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి ఏకంగా ఓ నిండు కుటుంబం బలైంది.

నేటికాలంలో ఏ విషయంలోనైనా నిర్లక్ష్యంగా ఉండే వారు ఎక్కువగా ఉన్నారు. ఇలా కొందరి సోమరితనం కారణంగా ఇతరులు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి ఏకంగా ఓ నిండు కుటుంబం బలైంది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉంటాయి. అయితే  అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అలానే  పలువురు తీవ్రమైన గాయాలతో  జీవితాన్ని నరకంగా అనుభవిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా అభశుభం తెలియని అమాయకులు బలవుతుంటారు. తాజాగా కూడా ఓ వాహనదారుడి నిర్లక్ష్యానికి ఓ నిండు కుటుంబ బలైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న ట్రక్కును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ కుటుంబం మొత్తం బలైంది. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బోన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో బనాస్ నది వంతెన సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీడ్రైవర్ ఇతర వాహనాల గురించి ఆలోచించకుండా అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు లారీని ఢీకొట్టింది. కారు వేగంగా లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.  మృతులు మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, అలానే సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని ఫ్రెండ్ కైలాష్‌గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో  మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. వీరందరు రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమదాం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ దుర్ఘటనపై  రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ,  ఉప ముఖ్యమంత్రి దియా కుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలానే ఈ ఘటనలు గాయపడిన వారికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల తమిళనాడులో కూడా ఓ వ్యక్తి వేగంగా కారు నడపడంతో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. అనుకోకుండా జరిగే ప్రమాదాల కంటే.. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలే ఎక్కువ ఉన్నాయి. మరి.. ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి.. ఇతరుల మరణానికి కారణమయ్యే వారికి ఎలాంటి శిక్ష విధించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments