Arjun Suravaram
Karnataka News: ఓ అక్కాతమ్ముడు.. అమ్మ కోసం చేసిన పని తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే వీళ్లలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Karnataka News: ఓ అక్కాతమ్ముడు.. అమ్మ కోసం చేసిన పని తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే వీళ్లలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
కుటుంబ వ్యవస్థలో రక్త సంబంధాలకు ఉండే విలువ, వారి మధ్య ఉండే ప్రేమానురాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తోడబుట్టిన వారి మధ్య ఆప్యాయత అనురాగాలు ఉంటాయి. కుటుంబ సభ్యులో ఎవరికి చిన్న సమస్య వచ్చిన మిగిలిన వారు ఎంతో వేదన చెందుతారు. కొన్ని సార్లు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమవుతుంటారు. తాజాగా ఓ అక్కాతమ్ముడు.. అమ్మ కోసం చేసిన పని తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే వీళ్లలాంటి నిర్ణయం తీసుకుంటారు. మరి.. ఈ అక్కాతమ్ముడి విషాద కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
కర్నాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ ప్రాంతంలో నటరాజ్, ఆయన భార్య లలితమ్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి నవ్య(26), ప్రభు(22) అనే కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆ దంపతులు ఇద్దరు కష్టపడి పనులు చేస్తూ..ఆ పిల్లలిద్దరిని చదివించారు. ఈ క్రమంలోనే ఇటీవలే నాలుగు నెలల క్రితం లలితమ్మ మృతి చెందారు. తమను ఎంతగానో ప్రేమగా చూసుకున్న తల్లి మరణాన్ని ఆ ఇద్దరు అక్కాతమ్ముడు తట్టుకోలేక పోయారు.
నిత్యం తమ అమ్మ గురించే ఆలోచిస్తుంటే వారు. ఆమె జ్ఞాపకాలు తల్చుకుంటూ మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే అమ్మ లేని జీవితం వృథా అని భావించారు. తాము కూడా తమ తల్లిదగ్గరకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. గురువారం రాత్రి చిక్కబళ్లాపూర్ సమీపంలోని సిడ్ల ఘట్టం అనే ఊరికి కిలో మీటర్ దూరంలో ఉన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇద్దరు బిడ్డల మృతితో నటరాజ్ విషాదంలో మునిగిపోయారు. కొన్నిరోజుల క్రితం భార్య, నేడు బిడ్డలు మరణించడంతో ఇక తనకు దిక్కు ఎవరంటూ ఆయన ఆయన గుండెలు పగిలేలా రోధించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ..రైల్వేస్టేషన్ కి చేరుకున్నారు. నవ్య, ప్రభుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభు రోజు వారీ కూలి చేస్తూ.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసే వాడు. తల్లి మరణ వార్త వారిద్దరిని తీవ్రవేదనకు గురి చేసింది. అమ్మపై ఉన్న పిచ్చి ప్రేమతోనే ఇలా చేశారని, కానీ తండ్రి పరిస్థితి ఏంటనే విషయాన్ని వాళ్లు మర్చారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి..ఇలాంటి ఆత్మహత్యల నివారణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.