Arjun Suravaram
PM Kaushal Vikaas Yojana: కేంద్రం యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ ఉపాధిని కల్పిస్తుంది. తాజాగా యువతకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఉపాధి కల్పన అందించే లక్ష్యంగా పలు ప్రణాళికలు అమలు చేస్తుంది.
PM Kaushal Vikaas Yojana: కేంద్రం యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ ఉపాధిని కల్పిస్తుంది. తాజాగా యువతకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఉపాధి కల్పన అందించే లక్ష్యంగా పలు ప్రణాళికలు అమలు చేస్తుంది.
Arjun Suravaram
కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. అంతేకాక రైతులకు, మహిళకు, అలానే విద్యార్థులకు కూడా ఎన్నో స్కీమ్స్ ను అందిస్తుంది. అలానే యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ ఉపాధిని కల్పిస్తుంది. తాజాగా యువతకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఉపాధి కల్పన అందించే లక్ష్యంగా పలు ప్రణాళికలు అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి పొందుతున్నారు. ఓ స్కీమ్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.8 వేలు సంపాదించ వచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాశ్ యోజన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.ఈ స్కీమ్ ఇండియాలోని యువత కోసం ఒక ప్రధానమైనది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఓ మార్గంగా పని చేస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వారి నైపుణ్యాలతో ఉపాధిని పొందవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధికి కల్పించేందుకు కేంద్రంలో శిక్షణ ఇస్తోంది.
ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని అర్హతలు ఉంటారు. వారు భారత పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారులు హిందీ, ఆంగ్లంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇది కోర్సును త్వరగా, సులభంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది. పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఎంతో మంది యువత ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో శిక్షణ పొందుతున్నారు.
దీని కోసం స్కిల్ ఇండియా డిజిటల్‌పై ప్రాక్టికల్ కోర్సును నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులో ఒక్కోక్క యువతకు నెలకు రూ.8 వేలు ఇస్తారు. అలానే ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో శిక్షణ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం తర్వాత సర్టిఫికేట్ కూడా జారీ చేస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చేయవచ్చు. ఈ సర్టిఫికేట్ దేశంలో ఎక్కడైనా చెల్లుతుంది, తద్వారా యువత ఏ రాష్ట్రంలోనైనా జాబ్ సంపాదించవచ్చు. దీని కోసం యువత ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.