యువ టెకీని కాపాడిన అమ్మ ఫోన్ కాల్!

కొన్ని సందర్భాల్లో చిన్న పనులే పెను ప్రమాదాల నుంచి కాాపాడుతుంటాయి. భూమిపై నూకలు ఉంటే అలానే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. తాజాగా ఓ తల్లి ఫోన్ కాల్ తో యువ టెకీ ప్రాణాలతో బయట పడ్డాడు.

కొన్ని సందర్భాల్లో చిన్న పనులే పెను ప్రమాదాల నుంచి కాాపాడుతుంటాయి. భూమిపై నూకలు ఉంటే అలానే జరుగుతుందని పెద్దలు అంటుంటారు. తాజాగా ఓ తల్లి ఫోన్ కాల్ తో యువ టెకీ ప్రాణాలతో బయట పడ్డాడు.

భూమి మీద నూకలు ఉంటే.. ఎంతటి ప్రమాదం నుంచైన బయటపడతారని పెద్దలు చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. అలానే కొన్ని సంఘటనలు చూసినప్పుడూ ఆశ్యర్యం కలుగుతుంది. చిన్న చిన్న పనులే పెద్ద ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయట పడేలా చేస్తాయి. తాజాగా ఓ తల్లి చేసిన ఫోన్ కాల్.. ఆ యువ టెక్కీ ప్రాణాలను కాపాడింది. పెద్ద బాంబు బ్లాస్ట్ నుంచి ఫోన్ కాల్ కారణంగా క్షణాల్లో బయట పడ్డాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

శుక్రవారం బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసింది.  ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడు నుంచి ఒక యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సినీ ఫక్కీలో తృటిలో తప్పించుకున్నాడు. పేలుడు సమయంలో బిహార్‌కు చెందిన టెకీ కుమార్‌​ అలంకృత్‌ రామేశ్వరం కేఫ్‌లో లంచ్‌ చేస్తున్నాడు. పేలుడు జరడానికి కొన్ని క్షణాల ముందు అలంకృత్‌కు తన తల్లి నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఫోన్ మాట్లాడేందుకు అలంకృత్‌ కేఫ్‌ నుంచి కొన్ని మీటర్లు బయటికి వచ్చాడు. ఇంతలో కేఫ్‌ లోపల పెద్ద శబ్ధంతో పేలుడు జరిగింది. ఈ పేలుడులో 9 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇక ఈ  ఘటన తరువాత అలంకృత్‌ మాట్లాడుతూ..తాను లంచ్‌ కోసం కేఫ్‌కు వచ్చానని, ఇడ్లీ తినడం పూర్తి చేశానని తెలిపాడు. అనంతరం దోశ తినడం స్టార్ట్‌ చేద్దామనుకునే లోపు తన అమ్మ నుంచి ఫోన్‌ వచ్చిందని అన్నాడు. ఇక ఫోన్‌ కాల్ రావడంతో దానిని పట్టుకుని బయటికి వెళ్లానని, ఇంతలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించిందని అలంకృత్ తెలిపాడు. అయితే గ్యాస్‌ సిలిండర్‌ పేలిందేమో అని తొలుత అనుకున్నానని చెప్పుకొచ్చాడు. ఎలా ఉన్నావు. తిన్నావా.. లేదా అని అడగడానికి తన తల్లి ఫోన్ కాల్ చేసిందని అలంకృత్ తెలిపాడు.  అమ్మ నుంచి ఫోన్‌ రాకపోయి ఉంటే తాను ఉండేవాడిని కాదని అలంకృత్‌ చెప్పాడు. బీహార్ కి చెందిన అలంకృత్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ హాస్టల్ లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం కూడా రామేశ్వరం కేఫ్ లో లంచ్ చేయడానికి వచ్చి..అమ్మ ఫోన్ కాల్ తో తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరి..ఈ విచిత్ర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments