రూ.19 కోట్ల కంపెనీకి CFO! పిల్లాడి బుక్ పేపర్‌పై రాజీనామా లేఖ..

రూ.19 కోట్ల కంపెనీకి CFO! పిల్లాడి బుక్ పేపర్‌పై రాజీనామా లేఖ..

రూ. 19 కోట్ల కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పని చేసిన ఓ వ్యక్తి ..తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన రాజీనామా మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

రూ. 19 కోట్ల కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పని చేసిన ఓ వ్యక్తి ..తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం ఆయన చేసిన రాజీనామా మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ జీతాలు, అలవెన్స్ తో పాటు రాజీమానాలు అనేది కూడా ఉంటుంది. ఎవరైనా రాజీనామా చేయలాంటే ఓ ప్రాసెస్ ఉంటుంది. దానికి అనుగుణంగా తన రాజీనామా లేఖను  రాసి.. పై స్థాయి అధికారులకు ఇస్తుంటారు.  వారు కూడా అతడి లేఖను పరిశీలించి..అంగీకరించడమో, తిరష్కరించడమే చేస్తుంటారు. అయితే కొన్ని రాజీనామాలు మాత్రం చాలా వింతగా ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి తన కంపెనికీ విచిత్రంగా రాజీనామా లేఖ అందించాడు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ పెయింట్ తయారీ సంస్థ మిత్షి ఇండియాలో రింకూ పటేల్ పని చేస్తున్నారు. అతడు ఆ కంపెనీలో సీఎఫ్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 1న తాను పని చేస్తున్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కి  లేఖ రాశాడు. తాను వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక రింకూ పటేల్ రాజీనామా చేసిన విషయాన్ని మిత్షి సంస్థ బాంబే స్టాక్ ఎక్సేంజ్ కి తెలియజేసింది. ఈ రాజీనామా లేఖను బీఎస్ఈ తన  వెబ్‌సైట్‌లో ఉంచింది. మామూలుగా రాజీనామాను మెయిల్ ద్వారా తన పైస్థాయి అధికారులకు పంపిస్తుంటారు.

అయితే రింకూ మాత్రం తన రాజీనామా లేఖను పిల్లలు రాసుకునే పాఠశాల పుస్తకంలోని ఓ పేజీపై తన సొంతంగా చేతితో రాశాడు. ఆ రాజీనామా లేఖను ఎండీకి రింకూ పంపాడు. పటేల్ రాసిన ఈ రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఇలా ఉంటే.. రింకూ పటేల్ రాజీనామా చేసిన రోజునే మిత్షీ ఇండియా కంపెనీ షేర్లు బాగా పెరిగాయి. అంతేకాక ఆ కంపెనీ షేర్ ధరలు  ఎవరు ఊహించని విధంగా పెరిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. డిసెంబర్ 22న జరిగిన స్టాక్ మార్కెట్ లో,  మిత్షీ కంపెనీ ఒక్కో షేర్ విలువ రూ. 23.30 వద్ద స్థిరపడింది.

అంతకుముందు రోజు ముగింపు ధర రూ. 22.33తో పోలిస్తే గణనీయంగా 4.34 శాతం పెరిగిందని సదరు సంస్థ అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఇటు రింకూ రాజీనామా లేఖ, అటూ షేర్లు ఊహించని విధంగా పెరగడంతో ఆ పెయింట్ సంస్థ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రముఖ కంపెనీలకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇన్ఫోసిస్ లోఆఫీస్ బాయ్ గా పని చేసిన వ్యక్తి.. కోట్ల కంపెనీకి అధిపతిగా మారిన కథనం కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  మరి.. రాజీనామా లేఖను స్కూల్ బుక్ లోని పేజీపై రాసి పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments