చరిత్ర సృష్టించిన భారత ఓటర్లు.. 7 దేశాలను వెనక్కి నెట్టిన భారత్..

World Record By Indian Voters: మన దేశం అరుదైన రికార్డుని సృష్టించింది. మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు సగౌరవంగా నిలిపి సత్తా చాటారు మన భారత ఓటర్లు. 7 దేశాలను వెనక్కి నెట్టి మరీ ప్రపంచ రికార్డుని నెలకొల్పారు.

World Record By Indian Voters: మన దేశం అరుదైన రికార్డుని సృష్టించింది. మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు సగౌరవంగా నిలిపి సత్తా చాటారు మన భారత ఓటర్లు. 7 దేశాలను వెనక్కి నెట్టి మరీ ప్రపంచ రికార్డుని నెలకొల్పారు.

భారతదేశం ఇప్పుడిప్పుడే అన్ని విధాలా డెవలప్ అవుతోంది. సినీ రంగం కూడా ప్రపంచ సినిమాలకు పోటీ పడుతుంది. అందునా తెలుగు సినీ పరిశ్రమ విదేశాల్లో సత్తా చాటుతుంది. రికార్డులను బద్దలు కొడుతూ, కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాయి. బాహుబలి నుంచి మొదలైన బాక్సాఫీస్ దండయాత్ర మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ వరకూ కొనసాగుతూ వచ్చింది. ఇంకా కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప 2 సినిమాలు ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాయి. ఇలా తెలుగు హీరోలు, భారతీయులు విదేశీ గడ్డ మీద జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పుడు సెలబ్రిటీల జాబితాలో సామాన్యులు సైతం చేరిపోయారు. మొన్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే.

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగ్గా, దేశంలోని తెలంగాణ సహా పలు రాష్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో విడతల వారీగా ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్న దానిపైనే ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే భారత ఓటర్లు వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈ 2024 ఎన్నికల్లో 642 మిలియన్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 64 కోట్ల 20 లక్షల మంది ఓట్లు వేశారు. ఈ సంఖ్య జీ7 దేశాలైన యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా ఓటర్లను కలిపితే వచ్చే సంఖ్య కంటే 1.5 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచ చరిత్రలోనే అరుదైన రికార్డు.

64 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని.. భారతదేశం 7 దేశాలను వెనక్కి నెట్టిన దేశంగా నిలబెట్టారు. ఈ లెక్కన మనవాళ్లలో ఎంత చైతన్యం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఇలా లేదు. ఈసారి ఎలక్షన్స్ కి మాత్రం చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు బాగా పని చేశారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టారు. బస్ టికెట్లపై ఆఫర్లు, బైక్ ట్యాక్సీ ఉచిత రైడింగ్ లు, పలు నగదు, నగల ఆఫర్లు వంటివి జనాలను బాగా ప్రభావితం చేశాయి. చాలా మందిలో చైతన్యం కలిగేలా టీవీ కార్యక్రమాలు వంటివి కూడా ఉపయోగపడ్డాయి. మరి జీ7 దేశాలను వెనక్కి నెట్టి మరీ దేశాన్ని భారత ఓటర్లు నంబర్ వన్ గా నిలపడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments