Indian Railway: రైలు ప్రయాణంలో 'C/Fa', 'W/L'బోర్డులు గమనించారా? వాటి అర్థమేంటో తెలుసా?

రైలు ప్రయాణంలో ‘C/Fa’, ‘W/L’బోర్డులు గమనించారా? వాటి అర్థమేంటో తెలుసా?

Indian Railway: దేశంలో ప్రతిరోజూ రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. రైలు ప్రయాణం చౌక మాత్రమే కాదు..సురక్షితం అని అందరి నమ్మకం.

Indian Railway: దేశంలో ప్రతిరోజూ రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. రైలు ప్రయాణం చౌక మాత్రమే కాదు..సురక్షితం అని అందరి నమ్మకం.

భారత దేశంలో రైలు ప్రయాణాలు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. సుదూర ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణాలు చాలా సదుపాయంగా ఉంటాయి. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రతిరోజూ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు ఇతర పనులపై వేళ్లే వారు లక్షల సంఖ్యల్లో రైలు ప్రయాణాలు చేస్తుంటారు. సాధారణంగా రైలు ప్రయాణాలు చేసే సమయంలో మనకు రక రకాల బోర్డులు కనిపిస్తుంటాయి.. వాటికి ఎన్నో అర్థాలు ఉంటాయి. రైల్వే ట్రాక్ పక్కన ‘C/Fa’, ‘W/L’ బోర్డులు గమనించారా? వీటి అర్థం ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో నిత్యం లక్షల సంఖ్యల్లో రైలు ప్రయాణాలు చేస్తున్న విషయం తెలిసిందే. రైలు ప్రయాణంలో ఉండే మజా వేరు. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. బస్సుల్లో లేని సౌకర్యం ట్రైన్లలో ఉంటుంది. అంతేకాదు వీటి ధర బస్సుతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుకే చాలా మంది రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా రైల్వే స్టేషన్, రైలు లోపల, రైల్వే ట్రాక్ ప్రక్కన రక రకాల బోర్డులు కనిపిస్తుంటాయి. వాటిని మనం చూస్తుంటాం కానీ వాటి అర్థం ఏంటో పెద్దగా పట్టించుకోరు. కానీ రైల్వే శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ బోర్డుపై సూచించిన సూచనలు తప్పక పాటించాలి.

సాధారణంగా రైల్లో ప్రయాణం చేసే సమయంలో ట్రాక్ పక్కన  ‘C/Fa’ లేదా ‘W/L’ బోర్డులు చూసే ఉంటారు. మొదటి బోర్డు పై ‘C/Fa’అని రాసి ఉంటుంది. దాని కింద మరో బోర్డు పై ‘W/L’అని రాసి ఉంటుంది. ఇవి భద్రతా కోణంలో చాలా ముఖ్యమైన బోర్డులు. ‘C/Fa’దీని అర్థం ‘విజిల్’అని, ‘గేట్’ కాదని అర్థం. ఇక ‘W/L’ అంటే విజిల్ అండ్ లెవెల్ క్రాసింగ్ అని అర్థం. ఈ బోర్డు చూసి లోకో పైలట్ ఈ ప్రదేశానికి చేరుకున్నపుడు ముందుగానే హారన్ మోగించాలని అర్థం. ఎదురుగా ఎవరైనా ఉంటే ట్రాక్ పై నుంచి తప్పుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని అర్థం. అలాగే.. ముందుగా లెవెల్ క్రాసింగ్ ఉన్న కారణంగా రైలు వేగాన్ని తగ్గించాలని అర్థం. ఈ విధంగా ముందు గేటు వద్ద నిలబడి ఉన్న వ్యక్తులు ఈ సౌండ్ విని అప్రమత్తం అవుతారు. క్రాసింగ్ దాటే ప్రయత్నం చేయకుండా ఉంటారు.

Show comments