Venkateswarlu
Venkateswarlu
పాపం ఆ తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకుండాపోయే సరికి ఎంతో విలవిల్లాడారు. కొద్దిరోజుల తర్వాత కూతురి శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధాతప్త హృదయాలతోటే ఆమె అంత్యక్రియలు చేశారు. అయితే, అంత్యక్రియలు జరిగిన కొన్ని రోజులకు ఓ అద్భుతం జరిగింది. ఆ ట్విస్ట్‌తో యువతి తల్లిదండ్రులు సంతోషంతో పాటు షాక్ అయ్యారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. బిహార్, పుర్నియాలోని అక్భర్‌పుర్‌కు పోలీస్ స్టేషన్‌కు పరిధికి చెందిన అన్షు కుమారీ నెల రోజుల క్రితం ఇంటినుంచి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు కూతురి మిస్సింగ్‌పై కేసు పెట్టారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఓ కాల్వలో ఓ యువతి మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని గుర్తించాల్సిందిగా అన్షు కుమారీ తల్లిదండ్రుల్ని పిలిపించారు. వారు ఆ మృతదేహం తమ కూతురిదేనని తేల్చారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని వారికి అప్పగించారు. వారు బాధాతప్త హృదయాలతో కూతురి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు జరిగిన కొద్దిరోజులకు అన్షు తండ్రికి ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత ఆయన సంతోషంతో పాటు షాక్‌కు కూడా గురయ్యాడు.
ఆ ఫోన్ చేసింది స్వయంగా అన్షూనే.. ‘‘ నాన్న! నేను బతికే ఉన్నాను’’ అని చెప్పింది. అన్షూ బతికే ఉందని తెలియటంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లి విరిశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అన్షూకు వీడియో కాల్ చేశారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో ఇళ్లు విడిచి పారిపోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రియుడి ఇంట్లో ఉన్నానని చెప్పింది. ఇక, పోలీసులు కేసును క్లోజ్ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.