Dharani
Tungabhadra Dam: కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన తుంగభద్ర డ్యామ్ కు ప్రమాదం జరిగింది. ఆ వివరాలు..
Tungabhadra Dam: కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన తుంగభద్ర డ్యామ్ కు ప్రమాదం జరిగింది. ఆ వివరాలు..
Dharani
కర్ణాటకతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాణాధారమైన తుంగభద్ర డ్యామ్ కు ప్రమాదం జరిగింది. 69ఏళ్ల డ్యామ్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అంటున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర నదికి భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ధాటికి తట్టుకోలేక తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ కు గత కొన్ని రోజులుగా ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్ట్‌గేట్లను ఎత్తారు అధికారులు. అయితే శనివారం రాత్రి 11గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు అధికారులు. గేట్ చైన్‌లింగ్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
గేటు తేగిన నేపథ్యంలో ప్రస్తుతం డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. నీటి మట్టం తగ్గితేనే గేటును రిపేర్ చేసే అవకాశం ఉందని తెలిపారు. తుంగభద్ర గేటు డ్యామ్ తెగడంతో.. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
తుంగభద్ర డ్యామ్‌ను కర్నాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యామ్ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గేట్ కొట్టుకువడంతో.. చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ వద్దకు వచ్చి పరిశీలించనుంది. ఆ తర్వాత పరిస్థితిపై.. ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది. గేటు కొట్టుకుపోవడానికి గత కారణాలను పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే, మిగతా గేట్లకు, డ్యామ్‌కు ఎలాంటి సమస్యా లేదంటున్నారు.
ఇదిలాఉంటే.. తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ దగ్గర తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గేట్టు పెట్టి నదిలోకి ఈతకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రాలయం మీదుగా భారీగా వరద నీరు సుంకేసుల రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుంది. నీరు రాగానే సుంకేసుల గేట్లు కూడా ఎత్తనున్నారు. ఆ తర్వాత వరద నీరంతా కర్నూలు మీదుగా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్‌లో కి చేరుకుంటుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ నుంచి లక్ష 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం.