Gyanvapi: జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి!

జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి!

Gyanvapi: జ్ఞానవాపి వివాదం గురించి అందరికి తెలిసిందే. ఈ వివాదంపై కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా జ్ఞానవాపి కేసు విషయంలో కీలక మలుపు తిరిగింది. అక్కడ పూజలు నిర్వహించవచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Gyanvapi: జ్ఞానవాపి వివాదం గురించి అందరికి తెలిసిందే. ఈ వివాదంపై కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా జ్ఞానవాపి కేసు విషయంలో కీలక మలుపు తిరిగింది. అక్కడ పూజలు నిర్వహించవచ్చని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జ్ఞానవాపి కేసు కీలక మలుపు తిరిగింది. జ్ఞానవాపిలోని సెలార్ లో పూజలు నిర్వహించుకునేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఇది హిందువులకు అతిపెద్ద విజయమని ట్రస్ట్ తెలిపింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవుళ్ల విగ్రహాలను గుర్తించారు.

బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో వివాదస్పద జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వారణాసి కోర్టు మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుతో హిందువులు పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కోర్టు ఇచ్చిన తీర్పుపై కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ స్పందించింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు హిందువులకు భారీ విజయంగా ఆ ట్రస్ట్ వర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో..మూసివేసిన మసీదు బేస్ మెంట్ ప్రాంతంలోని దేవతల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తామని ట్రస్ట్ ప్రకటించింది.

హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడారు…”వ్యాస్ కా టేఖానా లో ప్రార్థనలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా యంత్రాంగం ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుంది. హిందువులు అందరూ పూజలు చేయండి. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణమోహన్ పాండే ఆదేశాలిచ్చారు. ఇప్పుడు జ్ఞానవాపి మసీదు సెలార్ ను తెరవాలని ఆదేశాలు వచ్చాయి. రామజన్మభూమిలాగే ఈ కేసులోనూ హిందువులు విజయం సాధిస్తారు ” అంటూ ఆయన వ్యాఖ్యనించారు. ఇక జ్ఞానవాపి విషయానికి వస్తే.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏఎస్ఐ సర్వే నేపథ్యంలో మసీద్ సెల్లార్ ప్రాంతానికి సీల్ వేశారు. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆ బారికేట్లను తొలగించనున్నారు. అంతేకాకదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలను నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

Show comments