Nidhan
అయోధ్య రామాలయం కోసం ఓ వంశీయులు 500 ఏళ్లుగా దీక్ష చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు వాళ్లు చేసిన శపథం నెరవేరింది.
అయోధ్య రామాలయం కోసం ఓ వంశీయులు 500 ఏళ్లుగా దీక్ష చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు వాళ్లు చేసిన శపథం నెరవేరింది.
Nidhan
మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్య రామమందిరం గురించే మాట్లాడుకుంటున్నారు. భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువు దీరడానికి మరో మూడ్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా ఈ ప్రోగ్రామ్‌కు అటెండ్ కానున్నారు. అయితే భవ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఓ వంశీయుల కల నెరవేరబోతోంది. ఆ వంశంలో ప్రస్తుతం బతికి ఉన్న వాళ్లే కాకుండా వాళ్ల తండ్రులు, తాతలు, ముత్తాతలు కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కలలుగన్నారు. అందుకోసం వాళ్లు కఠిన శపథం కూడా చేశారు.
అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యే వరకు తలపాగాలు ధరించమని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూర్యవంశీ ఠాకూర్లు శపథం పూనారు. యూపీలోని సరైరాసి గ్రామానికి చెందిన ఈ వంశస్తులు ఇచ్చిన మాట మీద గత 5 దశాబ్దాలుగా నిలబడ్డారు. ఈ 500 ఏళ్లలో ఎన్నడూ వాళ్లు నెత్తికి తలపాగాలు వేసుకోలేదు. కానీ ఎట్టకేలకు భవ్య రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకొని.. ప్రాణ ప్రతిష్టకు సిద్ధమైంది. తమ శపథాలు, కన్న కలలు నెరవేరుతుండటంతో సూర్యవంశీ ఠాకూర్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఐదొందల సంవత్సరాల తర్వాత ఆ వంశస్తులు తలపాగాలు ధరించారు. అసలు వాళ్లు ఈ శపథం ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.. 500 ఏళ్ల కింద అయోధ్యలో రామమందిరం కూల్చివేశారు. గుడి స్థానంలో బాబ్రీ మసీదును కట్టారు. దీంతో మసీదు కట్టడాన్ని నిరసిస్తూ సూర్యవంశీ ఠాకూర్లు తమ తలపాగాలు తీసేశారు.
అయోధ్యలో రామాలయాన్ని కూల్చిన చోటే మళ్లీ గుడిని నిర్మించినప్పుడే తిరిగి తలపాగాలు ధరిస్తామని శపథం చేశారు. తమది శ్రీరాముడికి సంబంధించిన వంశంగా చెప్పుకొనే సూర్యవంశీ ఠాకూర్ల కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. మరో మూడ్రోజుల్లో భవ్య రామమందిరం ప్రారంభం కానుంది. దీంతో వీళ్లు తమ దీక్షను ముగించారు. సరైరాసి గ్రామంలోని సూర్యవంశీ ఠాకూర్ వంశస్తులు నెత్తికి తలపాగాలు ధరిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఈ వంశానికి శ్రీరాముడి మీద ఉన్న భక్తి ఎంతో ఈ శపథాన్ని బట్టి అర్థం చేసుకోవాలని అంటున్నారు. మరి.. సూర్యవంశీ ఠాకూర్ల శపథంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WATCH | Uttar Pradesh: People from the ‘Suryavanshi Thakur’ community in Sarairasi village of Ayodhya wear turbans after almost 500 years, ahead of Ram Temple’s ‘pranpratishtha’. The community had taken an oath that they would not wear a turban till the temple was reconstructed… pic.twitter.com/9QZckTGbEk
— ANI (@ANI) January 18, 2024