RS Shivaji Passed Away: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.. సినిమా రిలీజైన తెల్లారే

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.. సినిమా రిలీజైన తెల్లారే

ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. శుక్రవారం నాడు ప్రముఖ మలయాళ నటి అపర్ణ నాయర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందని సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అయితే భర్తతో గొడవల కారణంగానే అపర్ణ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం విచారకరం అంటున్నారు. ఆమె మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు, కమెడియన్‌ ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..

ప్రముఖ తమిళ నటుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ఆర్‌ఎస్‌ శివాజీ(66) మృతి చెందారు. చెన్నైలోని ఆయన నివాసంలో శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన ఎక్కువగా తమిళ్‌ చిత్రాల్లోనే నటించారు. డబ్బింగ్‌ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. శివాజీ తన కెరీర్‌లో ఎక్కువ శాతం కమల్‌ హాసన్‌తో కలిసి నటించారు. కమల్‌ ప్రొడక్షన్‌ హౌస్‌.. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాక.. పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సౌండ్‌ డిజైన్‌, లైన్‌ ప్రొడక్షన్‌ విభాగాల్లో పని చేశారు.

ఇక శివాజీ చివరిసారిగా.. లక్కీమాన్‌ చిత్రంలో నటించారు. యోగి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్ననే అంటే సెప్టెంబర్‌ 1, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిలైజన మరుసటి రోజే ఆయన మృతి చెందడం విచారకరం అంటున్నారు. శివాజీ కుటుంబం మొత్తం ఇండస్ట్రీలోనే సెటిల్‌ అయ్యింది. శివాజీ సోదరుడు.. సంతాన భారతి.. నటుడు మాత్రమే కాక దర్శకుడు కూడా. ఇక శివాజీ తండ్రి ఎం ఆర్‌ సంతానం కూడా నటుడే. 1945లో విడుదలైన మీరా చిత్రంలో శివాజీ తండ్రి కీలక పాత్రలో నటించారు. శివాజీ.. 1980లో సినిమాల్లోకి వచ్చారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments