Arjun Suravaram
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటి కారణంగా పలువురు సెలబ్రిటీలు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు వంటి కారణంగా పలువురు సెలబ్రిటీలు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
జీవితం అన్న తరువాత సమస్యలు అనేవి సహజం. ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడి జీవితాన్ని ముందుకు సాగించాలి. కానీ కొందరు మాత్రం సమస్యలకు భయపడి..చావే పరిష్కార మార్గంగా భావిస్తుంటారు. ఇలా కేవలం సామాన్యులు మాత్రమే కాదు..కోట్ల ఆస్తులు ఉన్న ధనవంతులు కూడా చేస్తున్నారు. గతంలో కాఫీడే యాజమాని సిద్దార్థ్ నదిలో దూకి ఆత్మహత్యచేసుకున్న సంగతి తెలిసింది. అలానే మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఓ బుల్లితెర డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆర్థిక సమస్యల కారణంగానే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కన్నడ బుల్లితెర దర్శకుడు వినోద్ దొండే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణం టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ఈనెల 20న ఆయన తన నివాసంలో ఆత్మహత్య పాల్పడ్డాడు. 20 ఏళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో దర్శకుడిగా ఆయన రాణిస్తున్నారు. అనేక సీరియల్స్ కి దర్శకుడిగా వ్యవహరించారు. తనదైన డైరెక్షన్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా బుల్లితెర డైరక్షన్ చేస్తున్న ఆయన అశోక్ బ్లేడ్ అనే సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ మూవీ షూటింగ్ 90 శాతం వరకు పూర్తైంది. కానీ అంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపరిచింది.
ఇక ఆయన కారణంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యల కారణంతోనే ఆయన ప్రాణాలు తీసుకున్నారని తెలుస్తోంది. తొలి మూవీ కోసం చేసిన అప్పులే ఇందుకు కారణమని సమాచారం. ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్ వర్ధన్ హరి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ..1970 బ్యాక్‌డ్రాప్‌లో అశోక బ్లేడ్ సినిమా తీస్తున్నామని తెలిపారు. సతీశ్ నినాశం హీరోగా నటిస్తున్నాడని, ఇది వినోద్ దొండే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభించామని, తొలుత 45 రోజులే అనుకున్నామని కానీ 87 రోజుల వరకు షూటింగ్ జరిగిందని వర్ధన వెల్లడించాడు.
ఈ క్రమంలో రూ.1.5 కోట్లు అనుకున్న బడ్జెట్ కూడా పెరుగుతూనే వస్తోందని తెలిపాడు. ఈ క్రమంలోనే మళ్లీ ఇప్పుడు కొన్ని సీన్స్ , ఓ సాంగ్ ను, ఫైట్ సీన్‌ను రీషూట్ చేయాలనుకున్నామని వర్ధన్ తెలిపాడు.ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశామని, ఇప్పుడెలా అని తనలో తానే వినోద్ దొండే మదనపడ్డాడని, ఈ క్రమంలో వారిద్దరు కలిసి ఇంకో నిర్మాతను కలిసి సాయం కోరగా ఆయన సానుకూలంగా స్పందించాడని వర్ధన్ అన్నారు. ఆ నిర్మాతతో మీటింగ్ అయిన తరువాత జూలై 19న రాత్రి వినోద్‌ను ఇంటి దగ్గర దిగబెట్టానని, కానీ తర్వాతిరోజే ఇలాంటి వినోద్ లేడనే వార్త వినాల్సి వస్తుందనుకోలేదని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఆర్థిక సమస్యలతో డైరెక్టర్ మరణం జరగడం అనేది కన్నడ బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది.