Weekend Reminder: ఈ వారం OTT లో అదిరిపోయే తెలుగు సినిమాలతో పాటు.. మలయాళ థ్రిల్లర్ కూడా !

మళ్ళీ వీకెండ్ రాబోతుంది.. మూవీ లవర్స్ అంతా కూడా.. ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రాబోతున్నాయా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ ఈ వీకెండ్ రిమైండర్.

మళ్ళీ వీకెండ్ రాబోతుంది.. మూవీ లవర్స్ అంతా కూడా.. ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రాబోతున్నాయా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అటువంటి వారందరికీ ఈ వీకెండ్ రిమైండర్.

శుక్రువారం అంటేనే సినిమాల పండుగ.. ఇది ప్రతి శుక్రవారం చెప్పే డైలాగ్ ఏ అయినా కూడా.. ఎప్పుడు చెప్పుకున్నా ఫ్రెష్ గానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు మాత్రమే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తాయి కాబట్టి.. ఇక మూవీ లవర్స్ అంతా కూడా.. మిడ్ వీక్ నుంచే ఈ వారం ఏ ఏ సినిమాలు ఓటీటీ లోకి రానున్నాయనే విషయాలను రెండు మూడు రోజుల ముందు నుంచే సెర్చ్ చేసే పనిలో ఉంటారు. అందుకే వారందరి పని సులువు చేసేలా ఈ వారం విడుదల కాబోయే సినిమాల లిస్ట్ లు, మూవీ సజ్జెషన్స్, వీకెండ్ రిమైండర్లు. ఇక ఈ వారం అయితే కాస్త స్పెషల్ అనే చెప్పి తీరాలి ఎందుకంటే.. ఈ వారం ఓటీటీ లోకి వస్తున్న చిత్రాలన్నీ.. కూడా థియేటర్స్ లో దుమ్ము దులిపేసిన చిత్రాలే. మరి ఏ ఏ చిత్రాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాల జాబితా ఇలా ఉంది..

1) ఫ్యామిలీ స్టార్ : ప్రైమ్ వీడియో
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం.. థియేటర్ లో రిలీజ్ అయిన కొద్దీ రోజులకే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. థియేటర్స్ లో ఓ మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీ లో ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం ఓ రకంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెప్పి తీరాలి. ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

2) భీమా : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
గోపిచంద్ కెరీర్ లో ఈ సినిమా ఒక మంచి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని.. అభిమానులంతా భావించారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. గోపించంద్ నటనకు మాత్రం ఫుల్ మార్క్స్ ఏ పడ్డాయి. మరి ఈ సినిమా ఓటీటీ లవర్స్ ఏ మేరకు మెప్పించనుందో వేచి చూడాలి. ఆల్రెడీ ఈ సినిమా ఈ అర్ధరాత్రి నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిపోతుంది.

3) టిల్లూ స్క్వేర్ : నెట్‌ఫ్లిక్స్
సిద్దూ జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటించిన ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులంతా.. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారీ సక్సెస్ సాధించడంతో.. ఈ సినిమా అనుకున్న దానికంటే ముందే ఓటీటీ లోకి రానుంది. ఈ సినిమా ఖచ్చితంగా ఓటీటీ లో కూడా యునానిమస్ టాక్ సంపాదించుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

4) నాయట్టు : ఆహా ఓటీటీ
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ లో.. ఓటీటీ లో రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది. ఇక ఇప్పుడు మలయాళ సినిమాలకు తెలుగులో పెరుగుతున్న క్రేజ్ తో.. ఈ సినిమాను కూడా తెలుగులో డబ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా తెలుగులో ఆహ ఓటీటీ లో ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

5) రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ : జియో సినిమా
పుల్వామా దాడి తర్వాత.. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.. అనే నిజ జీవిత ఘటనలను ఆధారంగా తీసుకుని.. ఎవరికీ తెలియని ఎన్నో నిజాలను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఏప్రిల్ 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ వీకెండ్ వినోదానికి ఈ సినిమాలు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments