సూపర్ హిట్ మలయాళీ మూవీ.. తెలుగులోకి మాత్రం డబ్ చేయరట!

సూపర్ హిట్ మలయాళీ మూవీ.. తెలుగులోకి మాత్రం డబ్ చేయరట!

ఈమధ్య కాలంలో విడుడుదలవుతున్న చిత్రాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఓ మలయాళీ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెలుగులో మాత్రం రీమేక్ చేయరట .. ఎందుకో తెలుసుకుందాం.

ఈమధ్య కాలంలో విడుడుదలవుతున్న చిత్రాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఓ మలయాళీ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెలుగులో మాత్రం రీమేక్ చేయరట .. ఎందుకో తెలుసుకుందాం.

గత వారం విడుదలైన మలయాళం రొమాంటిక్ కామెడీ “ప్రేమలు” సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. పాజిటివ్ టాక్ వల్ల ఈ సినిమాలో.. హైదరాబాద్ లో ఇప్పటికీ మల్టి ప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. మలయాళ సినిమా అయినప్పటికీ చక్కని హాస్యం, పాటలతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా హైదరాబాద్ నగరాన్ని చూపించడం కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా నిలిచింది. నిజానికి తెలుగు సినిమాలు కూడా ప్రేమలు లాగా.. హైదరాబాద్ ను అందంగా చూపించలేదని సోషల్ మీడియాలో ప్రేక్షకులు అంటున్నారు.

సినిమాలో హీరో హీరోయిన్ల రొమాన్స్ తో పాటు హైదరాబాద్ లోని ఐటీ ప్రొఫెషనల్స్ లైఫ్ స్టైల్, ఇలా చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే బ్యాక్ డ్రాప్ ఈ సినిమా విజయానికి కారణమని చెప్పవచ్చు. ఈ సినిమా విజయానికి కారణం ఏ బిల్డప్ లేకుండా సాగిన చక్కని కామెడీనే. కాగా ప్రధాన పాత్రధారులైన నస్లెన్ కె గఫూర్, మమితా బైజు కూడా అద్భుతంగా నటించి అందరి చేతా ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయడం లేదా రీమేక్ చేసి మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రేమలు సినిమాని డబ్బింగ్ లేదా రీమేక్ చేయడం వల్ల ఒరిజినల్ లోని నాచురల్ ఫీల్ పోతుందేమో అని ఒక వర్గం ప్రేక్షకులు అంటున్నారు. ఎందుకంటే సినిమాలో కథ ప్రకారం హీరో హీరోయిన్లు ఇద్దరూ మలయాళీలు అవడం.. వారిద్దరూ పని కోసం వేరే నగరమైన హైదరాబాద్ లో కలిసి ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయ్యింది. మరి ఇదే సినిమాని డబ్ లేదా రీమేక్ చేస్తే హైదరాబాద్ నేపథ్యం అనేది అంత కొత్తగా అనిపించదు. మరి నిజంగా ప్రేమలు సినిమాని తెలుగులో డబ్ లేదా రీమేక్ చేస్తే.. ఈ సవాళ్ళను ఎదుర్కొని కంటెంట్ అంతే బలంగా ఉండేలా చూడటం ఎవరికైనా కష్టమే.

Show comments