నా బాయ్‌ఫ్రెండ్‌ ఆ విషయంలో వేస్ట్‌.. అసహనం వ్యక్తం చేసిన శృతిహాసన్‌!

స్టార్‌ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు హీరోయిన్‌ శృతి హాసన్‌. లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూతురిగా పరిశ్రమలోకి వచ్చినా.. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, సంగీత దర్శకురాలిగా, సింగర్‌గా, సాంగ్‌ రైటర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. శృతి ప్రస్తుతం ప్యాన్‌ ఇండియా సినిమా ‘సలార్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రబాస్‌ సరసన హీరోయిన్‌గా చేస్తున్నారు. సలార్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. మరి కొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శృతి ఈ సినిమాతో పాటు తెలుగులో నాని 30లోనూ నటిస్తున్నారు.

వీటితో పాటు ‘ది ఐ’ అనే ఓ ఇంగ్లీష్‌ సినిమాలోనూ నటిస్తున్నారు. చేతిలో ఉన్నది రెండు, మూడు సినిమాలే కాబట్టి.. షూటింగులు లేని ఖాళీ సమయంలో శృతి తన ప్రియుడు శాంతనుతో పార్టీలు, షికార్లు అంటూ తెగ ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. ప్రియుడితో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతూ ఉన్నాయి. తాజాగా, ఆమె తన ప్రియుడిపై కామెంట్‌ చేసిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. శృతిహాసన్‌ ఆదివారం కొన్ని పూలను ఆర్డర్‌ పెట్టారు. వాటిని శాంతను తీసేసుకున్నాడు.

దీంతో శృతిహాసన్‌ అతడిపై కోప్పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నువ్వు చాలా అన్‌రొమాంటిక్‌ వ్యక్తివి. నువ్వు నా కోసం ఎప్పుడూ పూలను తెచ్చి ఇవ్వలేదు. అందుకే నేను పూలను ఆర్డర్‌ పెట్టుకున్నాను’’ అని అన్నారు. శృతి తన బాయ్‌ఫ్రెండ్‌ను అన్‌రొమాంటిక్‌ అనటంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రొమాంటిక్‌గా లేని వ్యక్తిని ఎలా ప్రేమించావు అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మరి, శృతి హాసన్‌ తన ప్రియుడు శాంతనును అన్‌రొమాంటిక్‌ వ్యక్తి అనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments