Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియో వైరల్! గూస్ బంప్స్ పక్కా!

కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీలో హెలెట్ గా నిలిచాయి యాక్షన్ సీక్వెన్స్. ఇదిలా ఉంటే.. ఈ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ సీన్స్ రావడానికి స్టంట్ టీమ్ గురించి వెల్లడించాడు నాగ్ అశ్విన్.

కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీలో హెలెట్ గా నిలిచాయి యాక్షన్ సీక్వెన్స్. ఇదిలా ఉంటే.. ఈ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఈ సీన్స్ రావడానికి స్టంట్ టీమ్ గురించి వెల్లడించాడు నాగ్ అశ్విన్.

బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టే అసలైన మొనగాడు రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి విదితమే. సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందంటూ సగటు సినీ ప్రేక్షకుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్‌కు అయితే ఓ రేంజ్ లెవల్ హైప్ ఇస్తున్నారంటే.. ఏం తాగి తీసినావ్ నాగీ మామ సినిమాను అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తొలి రోజే వరల్డ్ వైడ్‌గా రూ. 180 కోట్లకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టినట్లు టాక్. హాయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లలో మూడో స్థానంలో నిలిచిందని సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. కాగా, ఈ సినిమా కష్టం వెనుక నాగ్ అశ్విన్ శ్రమ, పట్టుదల ఎంతో ఉంది.

కాగా, ఈ సినిమాకు కీలకంగా మారాయి యాక్షన్ సీన్స్. బుజ్జితో ఫైట్ సీక్వెన్స్ కానీ, మహా భారత బ్యాక్ డ్రాప్ యుద్ధ సన్నివేశాలు, అశ్వత్థామ, ప్రభాస్ ఫైట్స్ సీన్స్ మూవీకి హైలెట్ అయ్యాయి. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్‌గా వర్క్ చేశాడు ఆండీ లాంగ్ అలియాస్ ఆండ్రీస్ న్యూగీన్. పలు చిత్రాలకు పని చేసిన అనుభవం ఉంది. హాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో లైగర్ మూవీకి స్టంట్ మాస్టర్‌గా వర్క్ చేశాడు. తన పనితనం నచ్చి ఈ మూవీకి తీసుకున్నాడు నాగీ. కాగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ ట్రెమండస్ రెస్పాన్స్ రావడం వెనుక.. ఆండీ టీం ఎంత కష్టపడింతో.. నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆండీ లాంగ్ వర్క్ గతంలో చూశాను. అతను చేసే వర్క్ చాలా బాగుందని చెప్పాడు కల్కి మూవీ దర్శకుడు.

‘ఆండీ ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తాడు. చిన్న సన్నివేశాన్నికూడా ఫర్ ఫెక్ట్‌గా రావాలని అనుకుంటాడు. అలాగే అతని టీం కూడా. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటులతో వర్క్ చేస్తున్నప్పుడు సీనియర్, వయస్సును దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు చిత్రీకరించడం, అలాగే ప్రభాస్ విషయంలో కూడా.. వారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా, వాళ్ల శక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా ఫైట్స్ క్రియేట్ చేస్తూనే.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సన్నివేశాలు తెరకెక్కించాడు. సేఫ్టీ అండ్ కంఫర్ట్‌కు ప్రాధాన్యతనిచ్చాడు. అతడి వర్కింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయాను. ఏమన్నా ఛేంజ్ చేయాలన్నప్పుడు, సీన్స్ యాడ్ చేయాలన్నప్పుడు అస్సలు టెన్షన్ తీసుకోడు. చాలా కూల్ అండ్ కామ్ గా వర్క్ చేస్తాడు’ అంటూ ఆండీ అండ్ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు నాగ్ అశ్విన్. యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియో వైరల్ అవుతుంది.

Show comments