Girls Will be Girls Movie: విడుదలకు ముందే అవార్డులు కొల్లగొడుతున్న చిన్న సినిమా!

విడుదలకు ముందే అవార్డులు కొల్లగొడుతున్న చిన్న సినిమా!

Girls Will be Girls Movie: ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి. అలానే తాజాగా ఓ చిన్న చిత్రం రిలీజ్ కి ముందే అవార్డులను కొల్లగొడుతుంది. మరి.. ఆ సినిమా ఏంటంటే...

Girls Will be Girls Movie: ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి. అలానే తాజాగా ఓ చిన్న చిత్రం రిలీజ్ కి ముందే అవార్డులను కొల్లగొడుతుంది. మరి.. ఆ సినిమా ఏంటంటే...

సినిమాలకు అవార్డులు రావడం అనేది సహజం. అయితే అన్ని మూవీస్ కి అవార్డులు రావు.  ఇక కొన్ని చిత్రాలు అయితే బాక్సాఫీస్ దుమ్ములేపుతాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక బహుమతులను కొల్లగొడుతుంటాయి. చాలా సినిమాలు విడుదలైన తరువాత వివిధ అవార్డులను అందుకుంటాయి. కొన్ని మూవీస్ మాత్రం రిలీజ్ కి ముందుకే కొన్ని రికార్డును క్రియేట్ చేస్తాయి. అలానే తాజాగా ఓ చిన్న సినిమా విడుదలకు ముందే అవార్డులను కొల్లగొడుతుంది. మరి..  ఆ సినిమా ఏంటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వార వారం అనేక కొత్త సినిమాలు థియేటర్లలో  సందడి చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని చిన్న సినిమాలు ఉండగా, మరికొన్ని పెద్దవి ఉంటాయి. ఇది ఇలా ఉంటే.. కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందే తమ సత్తా ఏమిటో చూపిస్తుంటారి. అలాంటి సినిమానే ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’.  త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సుచి తలాంటి తెరకెక్కించగా, కని కస్రుతి, ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈ చిన్న సినిమా..తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెల్చుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను సొంతం చేసుకుంది.

రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం పొందింది.  అంతే కాక ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెల్చుకుంది. అంతే కాకుండా సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో రెండు ప్రధాన ప్రైజ్ లను కూడా  అందుకుంది. తమ చిత్రం  ఇలా పెద్ద విజయం సాధించడం పట్ల  రిచా చద్దా సంతోషం వ్యక్తం చేశారు. ఇక  తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెల్చుకోవడంపై రిచా  పలు విషయాలను వెల్లడించారు. రిచా మాట్లాడుతూ.. తమ  సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవమని తెలిపారు. తమ బృంద కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ అనేది మన హృదయాలకు దగ్గరైన కథని రిచా పేర్కొన్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. మరి.. చిన్న సినిమా ఇలా అవార్డులను సొంతం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments