folk singer snehalatha murali passed away: మరో విషాదం.. ప్రముఖ జానపద గాయని స్నేహలత కన్నుమూత

మరో విషాదం.. ప్రముఖ జానపద గాయని స్నేహలత కన్నుమూత

ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ జానపద గాయని స్నేహలత మురళి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ జానపద గాయని స్నేహలత మురళి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ మధ్య సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. నిన్న నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అదే రోజు మరో నిర్మాత కూడా మృతి చెందారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ క్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ సంగీత స్వరం మూగబోయింది. తన గాత్రంతో మంత్ర ముగ్ధులను చేసిన ఆ జానపద గాయని తుది శ్వాస విడిచారు. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు మునిమనవరాలు, జానపద గాయని, స్వరకర్త స్నేహలత మురళి మృతి చెందారు. ఆమె కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి నిన్న (శనివారం) తుదిశ్వాస విడిచారు. స్నేహలత మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా స్నేహలత 3 దశాబ్ధాలుగా ఆకాశవాణి, దూరదర్శన్, ఉమ్మడి ఏపీ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ద్వారా ప్రదర్శనలిచ్చారు. సినిమాల్లో పలు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ఆమె మ్యూజిక్ డైరెక్షన్ లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఉషా, శైలజ, వాణి జయరాం, గీతామాధురి, మల్లికార్జున్‌ తదితరులు పాటలు పాడారు. ప్రస్తుతం ఈమె తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.

Show comments