Venkateswarlu
Venkateswarlu
మధ్యప్రదేశ్‌లోని సిధి ప్రాంతంలో చోటుచేసుకున్న మూత్ర విసర్జన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. పోలీసులు నిందితుడు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అధికారులు ప్రవేశ్ ఇంటిని బుల్డోజర్‌తో కూలగొట్టారు. అంతేకాదు! ముఖ్యమంత్రి సైతం ఈ ఘటనపై స్పందించారు.
బాధిత గిరిజన వ్యక్తిని తన ఆఫీస్‌కు పిలిపించారు. అనంతరం అతడి కాళ్లు కడిగి మరీ క్షమాపణ చెప్పారు. ఇక, సిధి ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన కారణంగా ప్రముఖ భోజ్‌పురి సింగర్ నేహా సింగ్ రాథోర్‌పై కేసు నమోదైంది. ఆమె గురువారం మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి ఓ క్యారికేచర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ ఫొటో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెపై చర్యలకు ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా, కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిధి ప్రాంతంలో ఓ గిరిజన వ్యక్తి రోడ్డు పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఇది చూసిన ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి అతడి దగ్గరకు వెళ్లాడు. ఆ గిరిజన వ్యక్తితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం అతడిపై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి, మూత్ర విసర్జన ఘటనపై పోస్టు పెట్టిన ప్రముఖ సింగర్‌పై కేసు నమోదు కావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
M P में का बा..?
Coming Soon.. #comingsoon #nehasinghrathore #प्रवेश_शुक्ला #ArrestPraveshShukla #politics #humanity #Shameless #women #upcoming pic.twitter.com/0suKLF9A87
— Neha Singh Rathore (@nehafolksinger) July 6, 2023