స్టార్ హీరోయిన్ కు కోర్టు నోటిసులు..కారణమేమిటంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై తాజాగా హై కోర్టులో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆమెకు కోర్టు నుంచి నోటిసులు కూడా వచ్చాయి. ఇంతకి ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై తాజాగా హై కోర్టులో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆమెకు కోర్టు నుంచి నోటిసులు కూడా వచ్చాయి. ఇంతకి ఏం జరిగిందంటే..?

సినీ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ కు వివాదాలేమి కొత్తేమీ కాదు. అయితే వారు చిన్న స్థాయిలో ఉండే నటులు అయిన స్టార్ ఈమెజ్ ఉన్న వారైనా.. ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు మంచి ఫేమ్ ఉన్నవారు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంటారు. అంతేకాకుండా.. లేనిపోని వివాదాలు చుట్టుముట్టడం వలన కోర్టులు, కేసులు అంటూ తిరుగుతుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో వివాదాల్లో చిక్కుకొని లేనిపోని ట్రోల్స్, కేసులు, కోర్టులు అంటూ చాలామంది నెట్టింట వైరల్ అయిన విషయం తెలలిసిందే. కాగా, ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ కు హై  కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఇంతకి  ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..

 ‘కరీనా కపూర్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తనదైన నటనతో  మెప్పించిన కరీనా స్టార్ ఈమెజ్ ను సంపాదించుకుంది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ బ్యూటీ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. కాగా, ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ అనుభవాలతో..  ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్ లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ..లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని హై కోర్టుని ఆశ్రయించారు.  ఇక  జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని.. సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది.  పైగా ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.

అలాగే కరీనా కపూర్ పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఇక ఈ పుస్తకాన్ని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే బుక్ టైటిల్‌లోని ‘బైబిల్’ పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. కాగా, క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు. మరి, కరీనా కపూర్ రాసిన బుక్ పై బైబిల్ అనే పదం ఉపయోగించడం వలన కోర్టు నుంచి నోటిస్ లు రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments