Venkateswarlu
Venkateswarlu
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సుహాసిని మణిరత్నం. 1980,90లలో ఆమె తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. సుహాసిని ప్రముఖ హీరో కమల్ హాసన్ అన్న కూతురన్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్‌గానే సుహాసిని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికి ఆమెకు ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పలేదు. పలు సినిమా షూటింగుల్లో ఇబ్బందిపడ్డారు. తాజాగా, సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
సుహాసిని మాట్లాడుతూ.. ‘‘ ఓ సీన్‌లో భాగంగా నన్ను హీరో ఒడిలో కూర్చోమన్నారు. నేను అలా కూర్చోనని చెప్పాను. భారతీయ స్త్రీ పరాయి మగాడి ఒడిలో కూర్చోదని అన్నాను. ఆ సీన్ చేయనని గట్టిగా చెప్పాను. మరో సీన్‌లో హీరో ఐస్ క్రీమ్ తింటూ నాకు తినిపించాలి. హీరో ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ తినమనటం నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ నేను ఎలా తింటాను.. నాకు వేరే ఐస్‌క్రీమ్ తీసుకురండి అన్నాను. అలా కాకపోతే సీన్ అయినా మార్చమని చెప్పాను.
అందుకు మా కొరియోగ్రాఫర్ ఒప్పుకోలేదు. తను చెప్పింది చేయమన్నాడు. నేను కుదరదని అన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఐస్ క్రీమ్ ముట్టుకోనని చెప్పా. నా స్నేహితురాలు శోభనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె చేయనని చెప్పటంతో.. ఆమెను దర్శకుడు తిట్టాడు. నువ్వేమన్నా సుహాసిని అనుకుంటున్నావా? అన్నాడంట. ఆ విషయం శోభన నాకు ఫోన్ చేసి చెప్పింది’’అని అన్నారు. మరి, చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.