Venkateswarlu
Venkateswarlu
‘‘ షారుఖ్ ఖాన్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. కానీ, అందం విషయానికి వస్తే మాత్రం.. అతడు కచ్చితంగా అందగాడు కాదు. అతడి చుట్టూ ఓ బలమైన ఆరా ఉంది కాబట్టి.. అందంగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే, అతడి కంటే అందంగా ఉన్న వారికి ఆ ఆరా లేదు. అందుకే వాళ్లను ప్రజలు గుర్తించలేకపోయారు. నా అభిప్రాయం ప్రకారం షారుఖ్ ఖాన్‌కు అసలు యాక్టింగే రాదు. అతడు ఓ గొప్ప బిజినెస్ మ్యాన్. తనను తాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. అతడి అభిమానులు నాతో ఏకీభవించకపోవచ్చు.
పర్లేదు. అతడు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తనను తాను బాగా మార్కెటింగ్ చేసుకోగలడు. అతడికంటే అద్భుతంగా నటించగలిగి.. గుర్తింపురాని నటులు చాలా మంది ఉన్నారు’’ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై ప్రముఖ పాకిస్తానీ నటి మహ్‌నూర్ చేసిన వ్యాఖ్యలివి. ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆమె షారుఖ్‌ను టార్గెట్ చేశారు. ఈ విధంగా దారుణమైన కామెంట్లు చేశారు. షారుఖ్‌పై మహ్‌నూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. మహ్‌నూర్‌పై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
‘‘ షారుఖ్ సినిమా సీడీ ఒకటి ఆమె ముఖాన పడేయండి. ఆయన యాక్టింగ్ గురించి తెలిసి వస్తుంది’’.. ‘‘షారుఖ్‌కు యాక్టింగ్ రాకుండానే 30 లక్షల మంది ఆయన్ని అభిమానిస్తున్నారా?’’.. ‘‘ షారుఖ్ ఖాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ, నువ్వు ఎవరు?’’..‘‘ ఎవరు ఈమె.. ఎక్కడినుంచి వచ్చింది?’’. ‘‘ ఆంటీ.. నువ్వు అతిగా మాట్లాడుతున్నావు’’ అంటూ విరుచుకుపడుతున్నారు. మరి, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై పాకిస్తాన్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.