Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31వ తేదీన తిరువనంతపురం, కరమానలోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇక, అపర్ణ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయటంతో.. ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అసలు నిజం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అపర్ణ మృతికి కుటుంబ కలహాలే కారణమని సమాచారం.
పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ వేగవంతం చేశారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 33 ఏళ్ల నటి పలు మలయాళ సినిమాలు, సీరియళ్లలో నటించారు. మొదట సీరియళ్ల ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. మేఘతీర్థం, అచయాన్స్ వంటి సినిమాలే కాకుండా ఇంకా చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. సీరియళ్లలో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. అపర్ణ దంపతులకు ఓ బాబు, ఓ పాప ఉన్నారు.
ఆమె తన భర్త పిల్లలతో కలిసి కరమానలోని ఓ అపార్ట్‌మెంట్, ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆగస్టు 31 ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని చనిపోయారు. అపర్ణ మృతితో బుల్లితెర పరిశ్రమలో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పలువురు సినీ ప్రముఖుల ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అపర్ణ మృతితో చిత్ర పరిశ్రమలోని వారి మానసిక స్థితులపై అనుమానాలను రేకెత్తిస్తోంది. మరి, కుటుంబ కలహాల కారణంగా అపర్ణా నాయర్ ఆత్మహత్య చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.