Arjun Suravaram
Darshans Case: కర్ణాటకలోని నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడిని దారుణంగా టార్చర్ చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
Darshans Case: కర్ణాటకలోని నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడిని దారుణంగా టార్చర్ చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
Arjun Suravaram
కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో దాదాపు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్ పేర్లను చేర్చారు. అలానే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి..కీలక సమాచారాన్ని సేకరించారు. ఇది ఇలా ఉంటే.. రేణుకా స్వామి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దర్శన్ కేసులో పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. అందులో ఆశ్చర్యానికి కలిగించే అంశాలు ఉన్నాయి. అతడికి కరెంట్ షాక్ ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అంతేకాక మరికొన్ని నిజాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు వైరల్ అవుతోంది. పవిత్ర గౌడకు అశ్లీల మెసేజ్ లు పంపాడంటూ హీరో దర్శన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే రేణుకా స్వామికి బుద్ధి చెప్పాలి అని భావించి..కొందర్న్ పురమాయించి.. కిడ్నాప్ కూడా చేయించాడు. బెంగళూరు పట్టణగెరెలోని ఓ షెడ్డులో ఉంచి దాడికి చేశారు. ఇక ఈ సంఘటనలో రేణుకా స్వామి మరణించాడు. ఇక రేణుకా స్వామి హత్య కేసులో ఇప్పటికే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో లొంగిపోయిన వారితో కలిపి మొత్తం 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా రేణుకాస్వామికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు వెల్లడైంది. హత్యకు ముందు రేణుకా స్వామిని చిత్ర హింసలకు గురిచేసినట్లు ఆ నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో అతడికి కరెంటు షాక్ ఇచ్చినట్లు తేలింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కేబుల్ వర్కర్ ధన్‌రాజ్‌ను విచారించారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాండ్యాకు చెందిన ధన్‌రాజ్ అనే ఓ కేబుల్ పని చేసే వ్యక్తని పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని పోలీసులు విచారించగా.. తనను నందీశ్ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లాడని తెలిపాడు. అక్కడే రేణుకాస్వామికి ఎలక్ట్రికల్ మెగ్గర్‌తో కరెంటు షాక్ ఇచ్చేందుకు ఏర్పాటు చేయమని చెప్పినట్లు ధన్ రాజ్ తెలిపాడు. వారు ఉపయోగించిన ఆ పరికరాన్నీ పోలీసులు స్వాధినం చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పట్టణంలోని పట్టణగెరెలోని షెడ్డులోనే రేణుకా స్వామిని చిత్రహింసలు పెట్టారని, తాను శాకాహారినని చెప్పినా కూడా బలవంతంగా బిర్యానీ నోట్లో పెట్టి తినిపించారని తెలిసింది. అనంతరం బాధితుడిపై పవిత్రా గౌడ, దర్శన్‌తోపాటు ఇతరులు దాడి చేసినట్లు సమాచారం.బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా.. వీటిలో ఏడు, ఎనిమిదిచోట్ల కాలిన గాయాలున్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది.