తీవ్ర విషాదం.. కుప్పకూలిన విమానం..9 మంది మృతి!

Passenger Plane Crashes: సాధారణంగా సుదూర ప్రాంతాలకు త్వరగా వెళ్లేందుకు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల తరుచూ విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళ కలిగిస్తున్నాయి.

Passenger Plane Crashes: సాధారణంగా సుదూర ప్రాంతాలకు త్వరగా వెళ్లేందుకు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల తరుచూ విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళ కలిగిస్తున్నాయి.

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాలు, ఇంజన్ లో మంటలు రావడం, ప్రకృతి అనుకూలించకపోవడం, పక్షుల ఢీ కొట్టడం ఇలా ఎన్నో కారణాల వల్ల విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే పైలట్ ప్రమాదాన్ని ముందుగా గమనించి వెంటనే ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలతో బయట పడుతున్నారు. కానీ.. కొన్ని సమయాల్లో ప్రమాదాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు.. ఫలితంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఓ విమాన ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

థాయిలాండ్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఏడుగురు టూరిస్టులతో సహా ఇద్దరు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. తూర్పు ప్రావిన్స్ లోని చాచోంగ్సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు వార్త వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే రెస్క్యూ టీమ్ అప్రమత్తమైన ఘటనా స్థలానికి వెళ్లిందని తెలిపారు.  భారత కాల మాన ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల (25 మైళ్లు) దూరంలో ఉన్న చాచోంగ్‌సావో ప్రావిన్స్ లోని అడవుల్లో కూలిపోయిన విమాన శకలలాను రెస్క్యూ టీమ్ కనుగొన్నారు.

థాయ్ లాండ్ లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ కో నిర్వహించే టర్బో ప్రాప్ ప్లెయిన సెన్నా కారవాన్ C208B గురువారం మధ్యహ్నం 2:46 గంటలకు బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన 11 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి.. ఆ తర్వాత విమానం ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయని అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు అంటున్నారు.

Show comments