Fire Accident: రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి

ఓ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల సుమారు 44 మంది మృతి చెందారు. ఆ వివరాలు..

ఓ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల సుమారు 44 మంది మృతి చెందారు. ఆ వివరాలు..

వేసవి కాలం వచ్చేసింది. ఇక తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు కానీ భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇక తాజాగా మరో చోట ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. సుమారు 44 మంది ప్రాణాలు విడిచారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆ వివరాలు

పొరుగు దేశం బంగ్లాదేశ్‌‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలోని ఓ మాల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించి.. మరో 75 మందిని రక్షించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి సమంతా లాల్ సేన్ మాట్లాడుతూ.. ‘‘గురువారం అర్ధరాత్రి ఢాకా నగరంలోని ఏడు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున ఘటనా స్థలం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. ఈ ప్రమాదంలో కనీసం 43 మంది మృతి చెందగా.. మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. అన్ని సహాయక చర్యలు అందిస్తున్నాం అని తెలిపారు. కోల్పోగా.. చికిత్స పొందుతున్న మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్టు సమంతా లాల్‌ వివరించారు. ప్రమాదం జరిగిన స్థలంలోనే 33 మంది చనిపోయారని, షేక్ హసినా ప్లాస్టిక్ సర్జరీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ మరో పది మంది మృతి చెందారని వెల్లడించారు. ఢాకా నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రముఖ మాల్‌లోని మొదటి అంతస్తు రెస్టారెంట్‌లో తొలుత మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇవి పై అంతస్తులకు వ్యాపించడంతో పదుల సంఖ్యలో జనాలు చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మాల్‌లో పనిచేసే మహమ్మద్ అల్తాప్ అనే ఉద్యోగి.. వంటగదిలోని కిటీకీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. కానీ, తన సహచరులు ఇద్దరు మంటల్లో కాలిబూడిదయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. పదుల కొద్ది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది రక్షించిన 75 మందిలో 42 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Show comments