షిరిడీ సాయి సమాధిని తాకే భాగ్యాన్ని ఇప్పుడు సామాన్య భక్తులకు సైతం కల్పించనున్నట్లు సాయి సంస్థాన్ పేర్కొంది. ఈ దీపావళి సెలవుల్లో ఆలయానికి రూ.17 కోట్ల కానుకలు వచ్చినట్లు తెలిపింది.
★ మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.
★ నిత్యం ఆరతి, భజనలతో రద్దీగా ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కసారైనా బాబా సమాధిని స్పృశించాలన్న ఆశ ఉంటుంది.
★ ఒకప్పుడు అది సులభమే అయినప్పటికీ రానురానూ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా షిరిడీ సాయి సంస్థాన్ మార్పులు చేసింది.
★ భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టింది.
★ ఒక్క వీఐపీ భక్తులకు మాత్రమే బాబా దగ్గరకు వెళ్లి ఆ సమాధిని తాకే అదృష్టం దక్కేది.
★ సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వచ్చేది.
★ అయితే ఇప్పుడు సామాన్యులకు కూడా సాయి సమాధిని తాకే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.
★ అంతే కాకుండా భక్తుల కోరిక మేరకు సాయి సచ్చరిత్రను వివిధ భాషల్లో ప్రచురించే ప్రణాళికలో ఉన్నామని సాయి సంస్థాన్ పేర్కొంది.
★ ఈ నిర్ణయాలపట్ల షిరిడీ గ్రామస్థులతో పాటు సాయి భక్తులు ఆనందంగా ఉన్నారు.
★ బాబా సమాధి విషయమై పలు మార్లు సంస్థాన్‌కు విన్నవించుకున్నామని.. ఇప్పటికి తమ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
17 కోట్ల ఆదాయం..
★ తిరుమల తర్వాత అంతటి రికార్డు స్థాయి హుండీ లెక్కింపులు ఉన్న ఆలయాల్లో షిరిడీ ఒక్కటి.
★ దీపావళి సెలవుల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఈసారి హుండీ ఆదాయం భారీగా నమోదైంది.
★ అక్టోబర్ 20 నుంచి నవంబర్ 5 వరకు.. ఆలయానికి రూ.17 కోట్ల 77 లక్షల 53 వేలు కానుకల రూపంలో వచ్చాయి.
★ దక్షిణ పేటికకు – 3 కోట్ల11 లక్షల 79 వేలు
★ విరాళాల రూపంలో – 7 కోట్ల 54 లక్షల 45 వేలు
★ ఆన్లైన్ విరాళం- కోటి 45 లక్షల 42 వేలు
★ చెక్, డీడీ – 3 కోట్ల 3 లక్షల 55 వేలు
★ మనీఆర్డర్లు – 7 లక్షల 28 వేలు
★ డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ – కోటి 84 లక్షల 22 వేలు
★ బంగారం – 860.450 గ్రామలు
★ వెండి- 970 గ్రాములు
★ 29 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ- 24 లక్షల 80 వేలు