P Krishna
Karimnagar Crime News: పెళ్లైన తర్వాత ప్రతి యువతి భర్తతో సంతోషమై జీవితాన్ని ఊహించుకుంటారు. కానీ తాము అనుకున్నవి అన్నీ జరవని తర్వాత బాధపడుతుంటారు.
Karimnagar Crime News: పెళ్లైన తర్వాత ప్రతి యువతి భర్తతో సంతోషమై జీవితాన్ని ఊహించుకుంటారు. కానీ తాము అనుకున్నవి అన్నీ జరవని తర్వాత బాధపడుతుంటారు.
P Krishna
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఎదుటి వారిపై దాడులు చేయడం, కొన్నిసార్లు హత్యలు చేయడం లాంటి చేస్తున్నారు. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఆవేశంలో వారు తీసుకునే నిర్ణయాల వల్ల పిల్లలు అనాథలుగా మిగిలిపోతుంటారు. చాలా వరకు పనిభారం, ఆర్థిక వ్యవహారాలు, అదనపు కట్నం కోసం అత్తింటి పోరు, వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఓ మహిళ కుటుంబ కలహాల కారణంగా తన బిడ్డతో సహ తనువు చాలించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ విషాద ఘటన జరిగింది. నగర సమీపంలోని బొమ్మకల్ గ్రామంలో విజయనగర్ కాలనీకి చెందిన శ్రీజ దారుణానికి ఒడికట్టింది. 11 నెలల పసిబాలుడు శ్రీహన్ష్ ను చంపి తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లీ కొడుకు మరణం గురించి తెలిసిన శ్రీజ తల్లి గాదె జయప్రద తీవ్ర మనస్థాపానికి గురై విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ లోని అపోలో రిచ్ ఆస్పత్రిలో చేర్పించారు. వరంగల్ కి చెందిన నరేష్ తో శ్రీజ వివాహం జరిగింది. పదకొండు నెలల క్రితం వీరికి బాబు పుట్టాడు. ప్రస్తుతం నరేష్ హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.
ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యయాని.. ఈ కారణంతోనే శ్రీజ పుట్టింటికి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే శ్రీజ గత కొన్నిరోజులుగా తనలో తాను బాధపడుతూ కృంగిపోతూ కనిపిస్తుందని తెలిపారు. ఈ బాధలన్నీ మనసులో పెట్టుకొని తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీజ తన కొడుకు శ్రీహన్ష్ కి విషగుళికలు ఇచ్చి చంపింది. తర్వాత ఆమె కూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పపడిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.