చిన్న వివాదానికే భర్త, పిల్లల ముందు మహిళపై దారుణం!

Delhi Crime News: ఇటీవల నడిరోడ్డుపై కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పాదాచారలు, వాహనాలపై వెళ్లే వారితో దురుసుగా ప్రవర్తించడం.. దాడులు చేయడం లాంటివి చూస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.

Delhi Crime News: ఇటీవల నడిరోడ్డుపై కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పాదాచారలు, వాహనాలపై వెళ్లే వారితో దురుసుగా ప్రవర్తించడం.. దాడులు చేయడం లాంటివి చూస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.

సాధారణంగా రోడ్డుపై వాహనదారులు అనుకోకుండా మరో వాహనాన్ని ఢీ కొడుతుంటారు.రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే తమ బైక్ కి  బుల్లెట్ ఢీ కొట్టిందని సదరు వాహన యజమానితో గొడవకు దిగారు. ఇరువురి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. అయినా సదరు వాహనదారులు సారీ చెప్పినా వినిపించుకోకుండా మహిళ, పిల్లలు ఉన్నారన్న విచక్షణ లేకుండా వాహనదారుడిపై చేయి చేసుకున్నారు.   ఈ క్రమంలోనే ఆకతాయిలు ఓ ఫ్యామిలీపై దాడి చేయడమే కాదు.. దారుణానికి పాల్పపడ్డారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలో వజీరాబాద్‌ రోడ్డులోని గోకల్‌పురి ఫ్లైఓవర్‌ సమీపంలో రోడ్డుపై జరిగిన ఘటనలో సిమ్రంజీత్ కౌర్(30) తన భర్త, ఇద్దరు కుమారుల ముందే కాల్చి చంపారు ఆకతాయిలు. హీరా సింగ్ (40) తన బుల్లెట్ వాహనంపై  భార్య సిమ్రంజీత్ కౌర్ ఇద్దరు పిల్లలతో కలిసి మౌజ్ పూర్ వైపు వెళ్తున్నాడు. గోకల్ పూరి ఫ్లైఓవర్ సమీపంలో ద్విచక్ర వాహనానికి వీరి బైక్ ఢీ కొట్టింది. అంతే ఆ బ్రైక్ డ్రైవర్  సిమ్రంజీత్‌ భర్తతో గొడవకు దిగారు. గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. ఇతర వాహనదారులు వచ్చి ఇరువురికి సర్ధిచెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే దుండగులు హిరా సింగ్‌ని వెంబడించి ఒక దుండగుడు గన్ తో కాల్పులు జరిపాడు. సిమ్రంజీత్‌ కౌర్ మెడకు సమీపంలో ఉన్న ఛాతీ పైభాగంలో బుల్లెట్ దూసుకుపోయిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే కన్నుమూసిందని వైద్యులు తెలిపారు. హీరా సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సిమ్రంజీత్ కౌర్ తన 12, 4 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ మాట్లాడుతూ.. బైక్ వస్తున్న దుండగులు హీరా సింగ్ వాహనాన్ని ఢీ కొట్టారు. ఆ సమయంలో అతను వాళ్లను దుర్భాషలాడాడు. ఆగ్రహంతో దుండగులు ఈ దారుణానికి తెగబడ్డారని అన్నారు.

Show comments