తరచూ ప్రజాప్రతినిధులపై, వివిధ పార్టీలకు చెందిన నేతలపై దాడులు జరుగుతుంటాయి. రాజకీయ వైరం, ఇతర కారణాలతో వివిధ పార్టీలకు చెందిన నేతలు దారుణంగా హత్య గావింప బడుతుంటారు. ప్రత్యర్థుల దాడుల్లో కొందరు తృటిలో తప్పించుకోగా, మరికొందరు హత్యకు గురవుతుంటారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ బీజేపీ నేతను దారుణంగా హత్య చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి.. ఆ నేతపై కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజ్ లో రికార్డయ్యాయి. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం శంభాల్ జిల్లా మొరదాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత అనూజ్ చౌదరి(34) గురువారం సాయంత్ర హత్యకు గురయ్యారు. గురువారం సాయంత్రం అనూజ్ మరోవ్యక్తితో కలసి.. తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వారి ముందుకు వచ్చారు. క్షణాల వ్యవధిలోనే అనూజ్ పై పలు రౌండ్ల కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు మొరాదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అలానే నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ..” రెండు వర్గాల మధ్య వ్యక్తిగత పోరు నెలకొంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశాము. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశాము” అని మొరదాబాద్ పోలీసులు చెప్పారు. ఇక అనూజ్ చౌదరి విషయానికి వస్తే.. స్థానికంగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. రెండేళ్ల క్రితం జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్ లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడ్డారని మృతుడి కుటుంబం ఆరోపించింది. మరి.. ఇలా నేతలు హత్యకు గురికావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: కన్న కూతుర్ని బైక్ కు కట్టి.. ఈడ్చుకెళ్లిన తండ్రి!