Crime News: పోలీసు అధికారి ఇంట్లో గలీజు పని.. ఇంటిని అద్దెకు ఇస్తే..

పోలీసు అధికారి ఇంట్లో గలీజు పని.. ఇంటిని అద్దెకు ఇస్తే..

సెలూన్ వ్యాపారం ముసుగులో కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. బయటికేమీ బ్యూటీ పార్లర్, లోపలికి వెళితే.. గలీజు దందా చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త అమ్మాయిలను తీసుకురావడం..

సెలూన్ వ్యాపారం ముసుగులో కొంత మంది అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. బయటికేమీ బ్యూటీ పార్లర్, లోపలికి వెళితే.. గలీజు దందా చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త అమ్మాయిలను తీసుకురావడం..

సెలూన్ బిజినెస్ ముసుగులో ఇటీవల కొత్త దందాను నడుపుతున్నారు. బయటకు ఏమో సెలూన్, బ్యూటీ పార్లర్ అని బోర్డులు పెట్టడం.. కస్టమర్లను రాబట్టుకుని గలీజు పనిని చేయిస్తున్నారు. మహిళలను ఎరగా వేసి.. లోపల వ్యభిచారం చేయిస్తున్నారు. ఇది తెలియని యువతులు సైతం వీరి ట్రాపులో పడిపోతున్నారు. బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం అంటూ పిలిచి.. చివరికి ఈ ఉచ్చులో దించుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక.. డబ్బు కోసం కొంత మంది యువతులు తలొగ్గుతున్నారు. అయితే ఇలాంటి పనులు చేస్తే.. పోలీసులు వస్తారని ఊహించిన ఓ వ్యక్తి.. ఏకంగా పోలీసు ఇంటినే సెలూన్ వ్యాపారానికి తెరలేపాడు.

సెలూన్ వ్యాపారం పేరుతో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్‍లో బయటకు వచ్చింది. మాజీ పోలీసు అధికారి ఇల్లు కావడంతో, తాను ఏం చేసినా ఎవ్వరు ఏం చేస్తారులే అని అనుకున్నట్లు ఉన్నాడు. గలీజు పనికి తెరలేపాడు. వివరాల్లోకి వెళితే మైసూర్‌లోని లలిత మహల్ నగర్ మెయిన్ రోడ్డులో ఉంది ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఇల్లు. అయితే తన ఇంటిలో సెలూన్ నిర్వహించేందుకు మహేష్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. బయటేమో సెలూన్ పెట్టి.. లోపల అంతా గలీజు పనులు చేస్తున్నాడు. అయితే ఈ విషయం పోలీసులు దృష్టికి వెళడంతో ఆపరేషన్ చేపట్టి.. పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అలనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Show comments