ప్రవళిక కేసులో మరో కీలక పరిణామం.. ఆధారాలు లేవంటూ..

శివరామ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక తల్లి, సోదరుడు శివరామ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అతడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

శివరామ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక తల్లి, సోదరుడు శివరామ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అతడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

ప్రవళిక కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు శివరామ్‌ శుక్రవారం అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అతడు పోలీస్‌ స్టేషన్‌కు కాకుండా నేరుగా.. నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అక్కడ సరెండర్‌ పిటిషన్‌ను దాఖలు చేశాడు. శివరామ్‌ వేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతినిచ్చింది. శనివారం ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కేసులో శివరామ్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ కోర్టు బెయిల్‌ మంజూరు మంజూరు చేసింది.

కాగా, వరంగల్‌ జిల్లాలోని దుగ్గొండి మండలం బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక అనే యువతి గ్రూపు-2 పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వటానికి హైదరాబాద్‌ వచ్చింది. అశోక్‌ నగర్‌లోని బృందావన్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకోసాగింది. ఈ నెల 13న రాత్రి ప్రవళిక హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి గ్రూపు -2 పరీక్షలే కారణమన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డీసీపీ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి, ప్రవళిక మరణంపై క్లారిటీ ఇచ్చారు. ఆమె లవ్‌ ఫెయిల్‌ కారణంగానే ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

శివరామ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రవళిక తల్లి, సోదరుడు శివరామ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. అతడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఇక, పోలీసులు శివరామ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొన్న అతడు మహారాష్ట్రలో పోలీసులకు చిక్కినట్లు ప్రచారం జరిగింది. గత కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న అతడు పోలీసుల దగ్గరకు కాకుండా కోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నాడు. మరి, కోర్టు శివరామ్‌కు బెయిల్‌ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments