Krishna Kowshik
తల్లికి దూరంగా ఉంటూ నర్సు ఉద్యోగం చేస్తూ ఇంటికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఆ అమ్మాయి. ఇంతలో కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రణయానికి దారి తీసింది.
తల్లికి దూరంగా ఉంటూ నర్సు ఉద్యోగం చేస్తూ ఇంటికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది ఆ అమ్మాయి. ఇంతలో కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రణయానికి దారి తీసింది.
Krishna Kowshik
అమ్మాయిలను ప్రేమ పేరుతో వల పన్ని లోబర్చుకుని.. పెళ్లి మాట ఎత్తితే చాలు మొహం చాటేస్తున్నారు కొందరు. పెళ్లి చేసుకోవాలని పంతం మీద కూర్చొంటే ఆమె అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిగో ఇదే జరిగింది షాలు తివారీ విషయంలో. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆమె పట్ల భక్షకుడిగా మారాడు. పెళ్లి అయిన పురుషుడితో ప్రేమలో పడి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమె కనిపించకపోవడంతో ఆమె తల్లి వెతకడం స్టార్ట్ చేసింది. కూతురి లవ్ స్టోరీ తెలిసినా కూడా ఎక్కడ ఉందో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. ఆమెకు నిరాశే ఎదురైంది. చివరకు ప్రియుడే ఆమెకు కాలయముడు అయ్యాడని తెలుసుకుంది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాలు తివారీ కాన్పూర్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో నర్సుగా పనిచేసింది. మూడు సంవత్సరాల క్రితం, ఆమె బర్రా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మనోజ్.. షాలు అద్దెకు ఉంటున్న గదికి వచ్చేవాడు. అలా వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అతడికి పెళ్లైన కూడా కాదని చెప్పి.. షాలును లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో తమ వ్యవహారం తల్లి సంగీతకు చెప్పింది షాలు. తల్లి కూడా వీరి పెళ్లికి అంగీకరించింది. దీంతో మనోజ్ కుమార్‌ను తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది షాలు.
తొలుత మాట దాటుకుంటూ వచ్చిన హెడ్ కానిస్టేబుల్.. ఒత్తిడి పెరగడంతో తనకు పెళ్లై, పిల్లలున్నారని చెప్పాడు. అయితే మోసం చేసినందుకు తనపై షాలు చర్యలు తీసుకుంటుందేమోనన్న భయంతో ఓ కుట్ర పన్నాడు. ఫిబ్రవరి 8న అయోధ్య విహార యాత్రకు వెళదామని చెప్పి.. తన స్నేహితుడు రాహుల్ సాయంతో తన స్వగ్రామానికి తీసుకెళ్లి.. ఆమెను చంపి బావిలో పడేశాడు. అయితే కూతురు ఆచూకీ తెలియకపోవడంతో మనోజ్ తో వెళ్లిపోయిందని అనుకుంది షాలు తల్లి. దీంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు తప్ప.. షాలు ప్రియుడ్ని విచారించలేదు. తల్లి పోలీస్ స్టేషన్‌కు, కమిషనర్ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేదు. చివరకు ముఖ్యమంత్రి యోగి చొరవతో పోలీసులు కేసు విచారణ చేపట్టగా.. మొబైట్ ట్రేస్ ఆధారంగా ఫిబ్రవరి 18న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. రాహుల్ ను విచారించితే.. డొంకంతా కదిలింది. ఇప్పుడు మనోజ్, రాహుల్ ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు