Krishna Kowshik
అతడిది పేద కుటుంబం. అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నాడు. అంతలో అతడికి ఇన్ స్టా వేదికగా ఓ అమ్మాయి పరిచయం ఏర్పడింది. అతడి జీవితాన్నే మలుపు తిప్పేసింది.
అతడిది పేద కుటుంబం. అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నాడు. అంతలో అతడికి ఇన్ స్టా వేదికగా ఓ అమ్మాయి పరిచయం ఏర్పడింది. అతడి జీవితాన్నే మలుపు తిప్పేసింది.
Krishna Kowshik
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం అన్నాడో సినీ కవి. ప్రస్తుతం కొన్ని సంఘటనలు చూస్తుంటే.. ఇది నిజం అనిపించక మానదు. తనే ప్రాణమని జీవించే అమ్మాయి.. ప్రియుడ్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. ఇటీవల కాలంలో రాధిక, బేబిలు ఎక్కువయ్యారు. ప్రేమ పేరుతో అబ్బాయిని తమ చుట్టూ తిప్పుకోవడం, తమ ఆర్థిక అవసరాలకు వారిని వినియోగించుకుని, అవసరం తీరాక లేకుంటే.. మరొకరితో ప్రేమ, వారి కన్నా గొప్ప సంబంధం వచ్చినా లవర్‌కు హ్యాండ్ ఇచ్చి.. మరో వ్యక్తిని మనువాడుతున్నారు. కోర్కెల కోసం ఒకడు, పెళ్ళికి ఇంకొకడు అన్నట్లుగా మారారు అమ్మాయిలు. తాజాగా ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందన్న ఉద్దేశంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ఒడిగట్టాడో కుర్రాడు.
నిజాయితీగా ప్రేమించిన అబ్బాయిలను అమ్మాయిలు మోసం చేస్తున్నారు అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..? కర్ణాటకలోని దొడ్డబళ్లాపూర్ తాలూకాలో. కొడిగేహళ్లిలో నివాసముంటున్న బాలాజీది పేద కుటుంబం. డెలివర్ బాయ్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. కనకపురానికి చెందిన యువతితో పరిచయం.. ప్రేమగా మారింది. ఇద్దరు ఫోన్ నంబర్స్ మార్చుకున్నారు. ఒకరికి ఒకరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే మనస్సులు కూడా ఛేంజ్ చేసుకున్నారు. ఇద్దరు కలుసుకుని చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. సెల్ఫీలు, ఒక కోకా కోలాలో రెండు స్ట్రాలు. థియేటర్ కార్నర్‌లో రెండు సీట్లు. ఇలా ఎన్నో చోట్ల తిరిగారు. ఎన్నో ప్రమాణాలు చేసుకున్నారు.
తనను పిచ్చిగా ప్రేమిస్తుందన్న భ్రమలో పడిపోయాడు బాలాజీ. అయితే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మా ఇంట్లో తాను మాట్లాడానని, నువ్వు కూడా మాట్లాడు అంటూ ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అప్పుడుగానీ బయటకు రాలేదు..పాపలోని అసలు స్వరూపం. తనలోని బేబిని బయటకు తీసుకువచ్చింది. మా ఇంట్లో నీతో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని చెబుతూనే.. పిడుగు లాంటి వార్త చెప్పింది. నేను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నా అని చెప్పడంతో.. బాలాజీకి ఒక్కసారిగా నేల కుంగినట్లయ్యింది. గుండెల్లో బాధ తన్నుకుంటూ వచ్చింది. ఆమె మోసాన్ని భరించలేకపోయాడు బాలాజీ. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేక.. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమకు అండగా నిలుస్తున్న కుమారుడు మరణించే సరికి కంటతడి పెడుతున్నారు. కాగా, మృతుడు కుటుంబ సభ్యులు యువతిపై దొడ్డబల్లాపూర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.