ఈ ఇద్దరు మామూలోళ్లు కాదు.. పెళ్లి పేరుతో..

ఈ ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ మామూలోళ్లు కాదూ.. అమ్మాయిలను ట్రాప్ చేయడంలో, వారిని మభ్య పెట్టడంలో ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేశారు. చివరకు..

ఈ ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ మామూలోళ్లు కాదూ.. అమ్మాయిలను ట్రాప్ చేయడంలో, వారిని మభ్య పెట్టడంలో ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేశారు. చివరకు..

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు భార్యా భర్తలు. భర్త బాధలో, ఆనందంలో తోడుగా నిలవడమే కాదూ.. అతడు చేసే పనిలో అండగా నిలుస్తూ ఉంటుంది భార్య. వీరి చేసే వ్యవహారం గురించి తెలిస్తే.. ఈ దంపతులను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనకుండా ఉండలేరేమో. ఈ ఇద్దరు సామాన్యులు కాదూ..మోసం చేయడంలో ప్రతిభావంతులు. ఈ కేటగిరిలో గోల్డ్ మెడల్ ఇచ్చేయచ్చు ఈ ఇద్దరికీ. ఆడ పిల్లల్ని ట్రాప్ చేస్తూ.. హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. భార్యా భర్తలు చేసే చీటింగ్ గురించి తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకు ఈ ముచ్చటైన దంపతులను చేస్తున్న ఆ వ్యవహారం ఏంటంటే.. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడం. పలు సంఘటనలు వెలుగు చూడటంతో సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లాలోని వెంకంపేటకు చెందిన యెలిగేటి రంజిత్ అలియాస్ యడ్ల శ్రీ రాధా కృష్ణ అలియాస్ రాకేష్, యెలిగేటి సంధ్య భార్య భర్తలు. హైదరాబాద్ నగరానికి వచ్చి.. పీర్జాదిగూడ వినాయక్ నగర్‌లో అద్దెకు నివసిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి.. పెద్దింటి అమ్మాయిలకు వల వేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయిల ప్రొఫైల్ డీటైల్స్ సేకరిస్తారు. ఆ వివరాల ఆధారంగా వారిని ట్రాప్ చేస్తాడు రంజిత్. శ్రీ రాధా కృష్ణగా పేరు మార్చుకుని.. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయిన అమ్మాయితో చాట్ చేసి తానొక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంటాడు. వారితో చనువుగా మాట్లాడి పరిచయం పెంచుకుంటాడు. భార్య సంధ్యను తన మేనేజర్ అంటూ వారికి పరిచయం చేసేవాడు.

అలా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి కూడా వారి తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పేవాడు. అతడు చెప్పినవన్నీ నమ్మిన అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించేవారు. కొన్ని రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అత్యవసరంగా డబ్బు కావాలంటూ.. వారి దగ్గర నుండి లక్షల డబ్బులు కాజేసేవాడు. కట్నం, ఇతర అవసరాల పేర్లు చెప్పి వసూలు చేసేవాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయేవారు. ఇలా సుమారు 12 మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ దంపతుల బండారం బయటపడింది. ఈ 12 మంది దగ్గర సుమారు రూ. 30 లక్షల వరకు దండుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. వీరి దగ్గర నుండి సాంట్రో కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఇంకా ఎవరైనా బాధితులున్నారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Show comments