భార్య, పిల్లల్ని కాల్చిన చంపిన కానిస్టేబుల్ ఘటనలో బిగ్ ట్విస్ట్!

కడపలో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గన్ తో భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే ఈ కేసులో తాజాగా ఓ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన వెంకటేశ్వర్లు మరణానంతరం వచ్చే బెనిఫిట్స్ ను ఆమె పేరిట రాయాలని ముందే బాండ్ పేపర్ పై రాసి ఏకంగా జిల్లా ఎస్పీగా విజ్ఞప్తి చేసినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే?

ఏపీలోని కడప జిల్లాలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. అసలు విషయం ఏంటంటే? వెంకటేశ్వర్లు తన మరణానంతరం వచ్చే బెనిఫిట్స్ ను అతని రెండవ భార్యకు చెందేలా చూడాలని ఆయన రూ.10 స్టాంప్ పేపర్ పై రాసి జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఇంతే కాకుండా బ్యాంక్ ఖాతాలో నా రెండవ భార్యను నామినీగా చేర్చాలని కూడా ఆయన కోరారు. ఈ వార్త తెలియడంతో అందరూ ఇప్పుడు షాక్ గురవుతున్నారు.

  • ఈ కేసులో అసలేం జరిగిందంటే?

కడపలోని కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వెంకటేశ్వర్లు కడప రెండో పట్టణ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వస్తుండేవాడు. అయితే తాజాగా వెంకటేశ్వర్లు భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే తుపాకీతో భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. ఇంతే కాకుండా చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Show comments