కిలాడీ లేడీ కీచక పనులు… వామ్మో.. డబ్బుల కోసం ఇలా కూడా చేస్తారా?

ఈ కిలాడీ లేడి ఎవరూ ఊహించని మోసానికి పాల్పడి చివరికి పోలీసులకు షాకిచ్చింది. దీంతో ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ మహిళ ఏం చేసిందంటే?

ఈ కిలాడీ లేడి ఎవరూ ఊహించని మోసానికి పాల్పడి చివరికి పోలీసులకు షాకిచ్చింది. దీంతో ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ మహిళ ఏం చేసిందంటే?

ఈ రోజుల్లో చాలా మంది కష్టపడి చెమట చిందించకుండా డబ్బులు సంపాదిస్తున్న వారు చాలా తక్కువ. ఎక్కువగా పని లేకుండా ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. మోసం చేయకుండా ఇలా చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, నేటి రోజుల్లో మాత్రం కొందరు వ్యక్తులు ఇలాంటి పనులే చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం ఎంతకైన తెగిస్తూ డబ్బులు పోగేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులే తలలు పట్టుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళ ఏం చేసింది? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ ఈజీ మనీ కోసం అలవాటు పడింది. గతంలో ఇలాంటి పనులు చేసి చివరికి చేతులు కాల్చుకుంది. ఇక ఇలా కాదని గమనించిన ఓ మహిళ.. ఎవరూ ఊహించని మోసానికి పాల్పడి చివరికి పోలీసులకే షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే? విజయలక్ష్మి డబ్బుల కోసం ఏకంగా ఎస్పీ అవతారం ఎత్తింది. అవును, మీరు విన్నది నిజమే. అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఫొటోను ప్రొఫైల్ గా పెట్టుకుంది. ఇక ఇటీవల అనంతపురం రూరల్, పట్టణ సీఐలకు వాట్సాప్ చాట్ చేసింది. నేను ఓ పని మీద వచ్చానని. అర్జెంట్ గా నాకు డబ్బులు పంపాలని పదే పదే వాట్సాప్ మెసేజ్ లు పంపింది. మొదట్లో పోలీసులు ఇదంతా నిజమే అనుకున్నారు. కానీ, ఎందుకో సీఐలకు అనుమానం వచ్చింది.

అప్రమత్తమై వెంటనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా డబ్బుల కోసం ఓ మహిళ ఇలా కీచక పనులకు తెర లేపిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమె అడ్రస్ ను సంపాదించి ఎట్టకేలకు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మహిళ ఏకంగా ఎస్పీ డీపీ పెట్టుకుని మోసానికి పాల్పడే ప్రయత్నం చేయడంతో పోలీసులకు షాక్ గరువుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైన సరే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం ఏకంగా పోలీసులను మోసం చేయాలని చూసిన ఈ కిలాడీ లేడీ కీచక పనులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments