Krishna Kowshik
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈ నాడే ఎదురౌతుంటే అంటూ తల్లి భావోద్వేగానికి గురైంది. ఉరి శిక్ష పడిన కూతుర్ని 11 ఏళ్ల తర్వాత చూస్తున్నానన్న ఆనందం తల్లి గుండెల్లో గూడు కట్టుకుంది. కూతురు కనబడే సరికి.. తల్లడిల్లిపోయింది. చివరకు
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈ నాడే ఎదురౌతుంటే అంటూ తల్లి భావోద్వేగానికి గురైంది. ఉరి శిక్ష పడిన కూతుర్ని 11 ఏళ్ల తర్వాత చూస్తున్నానన్న ఆనందం తల్లి గుండెల్లో గూడు కట్టుకుంది. కూతురు కనబడే సరికి.. తల్లడిల్లిపోయింది. చివరకు
Krishna Kowshik
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరంటారు. పిల్లల తర్వాతే తల్లికి ఎవరైనా. పిల్లలు తప్పులను సరి చేసేది కూడా తల్లి. కానీ కూతురు సరిదిద్ద లేని నేరం చేసి జైల్లో ఉంటే.. ఆమెను చూసేందుకు ఓ తల్లి పడే వేదన వర్ణనాతీతం. పిల్లల్ని ఒక్క నిమిషం పాటు వదిలి ఉండలేని తల్లి ఆమెను విడిచి కాదు.. సుమారు పదకొండేళ్ల పాటు చూడకుండా ఉండిపోయింది. చివరకు కూతుర్ని జైలు గోడల మధ్య కలుసుకోగలిగింది. కూతుర్ని చూసి వలవలా ఏడ్చింది. తల్లిని కౌగిలించుకుని కూతురు కూడా కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ ఘటన యెమెన్ జైలులో చోటుచేసుకుంది. ఇంతకు ఆ కూతురు ఎందుకు జైలులో ఉండాల్సి వచ్చిందంటే..?
యెమెన్ వ్యక్తిని చంపినందుకు కేరళ నర్సు నిమిషా ప్రియ నేరం నిర్ధారణ అయ్యి మరణ శిక్ష విధించింది కోర్టు. అక్కడ జైలులో మగ్గిపోతున్న కూతుర్ని పదకొండు ఏళ్ల తర్వాత తల్లి ప్రేమ కుమారి కలుసుకుంది. తల్లి, కూతుళ్ల భావోద్వేగానికి సాక్ష్యంగా నిలిచింది సనా జైలు. కూతురు నిమిషాతో కొన్ని గంటలు గడిపింది తల్లి. మళ్లీ కలుస్తానే లేదో అన్న ఉద్దేశంతో కూతుర్ని తనివితీరా చూసుకుని మురిసిపోయింది అమ్మ హృదయం. తనను చూడగానే పరుగున వచ్చి మమ్మీ అంటూ కౌగిలించుకుందని, ఇద్దరం ఏడ్చేశా అంటూ తల్లి ప్రేమ కుమారి చెప్పింది. కాగా, తల్లిని ఓదార్చిన ప్రియ.. ఏడవద్దని చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత తనను కలిశానని, ఇద్దరం క లిసి భోజనం చేశామంటూ చెప్పింది. తనలో విలువైన క్షణాలు గడిపానని పట్టారని సంతోషంతో పేర్కొంది ప్రేమ కుమారి.
ఇంతకు అసలు నిమిషా ప్రియ. . ఎందుకు ఉరి శిక్షను ఎదుర్కొంటుదంటే..? యెమెన్ వ్యక్తిని హత్య చేసినందుకు. వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన నిమిషా పరియా.. తన భర్త, కుమార్తెతో కలిసి యెమెన్‌లో స్థిర పడింది. అయితే 2014లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె భర్త, కూతురు తిరిగి ఇండియాకు వచ్చేశారు. అయితే నిమిషా మాత్రం.. తన వ్యాపారాన్ని కొనసాగించాలని అనుకుంది. యెమెన్ లో వ్యాపారం నిర్వహించాలంటే అక్కడి పౌరుడి సహాయం తప్పనిసరి. కాబట్టి 2015లో ఆమె తన భర్త స్నేహితుడు తలాల్ అబ్దో మహదీ సాయంతో ఆసుపత్రిని నిర్వహించడం ప్రారంభించింది. అయితే వీరిద్దరి మధ్య కొన్ని విబేధాలు వచ్చాయి. ఆమె పాస్ పోర్టు అతడి వద్ద ఉండిపోయింది. అదీ ఇవ్వమంటే తలాల్ తనను ఏడిపించసాగాడు.
తన పాస్ పోర్టు తీసుకునేందుకు 2017లో అతడికి మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ అది వికటించి అతడు మరణించాడు. ఈ కేసులో ఆమెను అదుపు తీసుకున్నారు పోలీసులు. తనను 2 సంవత్సరాల పాటు తలాల్ తనను హింసించారని చెప్పినప్పటికి.. వినిపించుకోని కోర్టు.. ఆమెకు ఉరిశిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ.. యెమెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అక్కడి కోర్టు కూడా తోసిపుచ్చింది. ప్రస్తుతం అక్కడ జైలులో మగ్గుతుంది నిమిషా. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన డబ్బుతో తల్లి యెమెన్ వెళ్లి పదకొండు ఏళ్ల తర్వాత కూతుర్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యింది. మిగిలిన ఖైదీలు కూడా ఆమెను బాగా పలకరించారని పేర్కొంది తల్లి.