ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి సొంతంగా కారు లేదా బైక్ ఉండాలని అనుకుంటున్నాడు. అయితే కారు మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయలేవు కాబట్టి.. వారి చూపు టూ వీలర్స్ పై పడుతుంది. దాంతో తమ బడ్జెట్ లో టూ వీల్లర్ ను కొనుగోలు చేయాలని చూస్తుంటారు చాలా మంది. అయితే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండటంతో పాటుగా.. తక్కువ ధరకే వస్తుండటంతో వినియోదారులు ఎక్కువ వాటిని కొనుగోలు చేయడానికి మెుగ్గు చూపుతున్నారు. ఇక తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలని చూసే వారికి క్రేజీ ఆఫర్ ను తీసుకొచ్చింది యో బైక్స్ కంపెనీ. కేవలం రూ. 49 వేలకే కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను అందిస్తోంది ఈ కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ ల ధరలు రూ. లక్ష పైనే ఉన్నాయి. దీంతో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే మధ్యతరగతి వారు వెనకడుగు వేస్తున్నారు. కాగా.. తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి యో బైక్స్ కంపెనీ వారు క్రేజీ ఆఫర్ ను ప్రకటించారు. ఈ స్కూటర్ ధర మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరతో పోల్చితే చాలా తక్కువ. అందువల్ల తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలి అనుకునే వారు ఈ మోడల్ ను పరిశీలించవచ్చు.
కాగా.. యో బైక్స్ కంపెనీ యో ఎడ్జ్ డీఎక్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ. 49,086 నుంచే ప్రారంభం అవుతోంది. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధర అని గుర్తుంచుకోవాలి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, 145 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో పాటుగా మరెన్నో ఫీచర్లను ఈ మోడల్ కలిగి ఉంది. ఈ స్కూటర్ కు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 60 కిలోమీటర్ల వరకు వెళ్తుందని యో కంపెనీ తెలిపింది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు కాగా.. 3 నుంచి 4 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కేజీల వరకు బరువును లాగగలదు. షో రూముల్లో రెడ్, బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటితో పాటుగా 3 ఏళ్ల వారంటీని కూడా కంపెనీ ఈ స్కూటర్ పై అందిస్తోంది. ఇక ఇతర వివరాల కోసం మీ దగ్గరలోని షోరూముల్లో మరిన్ని వివరాలు పొందొచ్చు.
ఇదికూడా చదవండి: యూజర్లకు షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. పాస్ వర్డ్ షేరింగ్ పై కీలక నిర్ణయం!