P Krishna
Gold and Silver Rates: రోజు రోజు కీ పెరిగిపోతున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి మరింత డిమాండ్ పెరిగింది.
Gold and Silver Rates: రోజు రోజు కీ పెరిగిపోతున్న బంగారం ధరలు కొనుగోలుదారులకు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి మరింత డిమాండ్ పెరిగింది.
P Krishna
ప్రపంచ వ్యాప్తంగా బంగారం అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా భారత దేశంలో మహిళలు బంగారు ఆభరణాలపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్త రకాల ఆభరణాల కోసం జ్యూలరీ షాపులకు క్యూ కడుతున్నారు. నేటి సమాజంలో బంగారం తమ వద్ద ఉంటే ఏదైనా ఆపద సమయంలో పనికి వస్తుందన్న నమ్మకం ఉంది. ఎందుకంటే భవిష్యత్ లో పసిడి ధరలు పెరగడమే తప్ప తగ్గేది ఉండదు. అందుకే బంగారం అంత విలువైనదిగా మారింది. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు ఆరు వేల వరకు పెరిగింది.
ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 2,256 డాలర్ల స్థాయిలో ట్రెండ్ అవుతుంది. రెండు రోజుల్లో తులం బంగారం రూ.1300 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర తులం రూ.7 వేల పైనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 వద్ద ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,110 వద్ద అమ్ముడవుతోంది. కిలో వెండి పై రూ.100 పెరిగింది.. ప్రస్తుతం వెండి ధర రూ. 89,000 వద్ద ట్రెండ్ అవుతుంది.
ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,270 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,110లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.72,120వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,160 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.84,100, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.85,600 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.89,100లు ఉండగా, ఢిల్లీ లో రూ. 85,600 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.