P Krishna
Gold and Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత పది రోజుల క్రితం కాస్త పరవాలేదు అనిపించినా.. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల కారణంగా ధరల్లో అనూహ్యంగా మార్పులు సంభవిస్తున్నాయి.
Gold and Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గత పది రోజుల క్రితం కాస్త పరవాలేదు అనిపించినా.. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల కారణంగా ధరల్లో అనూహ్యంగా మార్పులు సంభవిస్తున్నాయి.
P Krishna
దేశంలో బంగారం ధరలు చూస్తుంటే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. జనవరి, ఫిబ్రవరి లో పసిడి, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మార్చి నెల నాటికి మళ్లీ పుంజుకున్నాయి. వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల్లోనే తులం బంగారం ధర రూ. 1360 మేరకు పెరిగింది. ఇక వెండి కూడా అదే బాటలో నడుస్తూ రెండు రోజుల్లో ఏకంగా రూ.3000 లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో భారీ మార్పులు కారణంగా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెళ్లిబాజాలు వినిపిస్తున్నాయి. ధరలు ఎలా ఉన్నా.. మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేల మార్క్ చేరింది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.65 వేలకు చేరువలో ఉంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,600లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,470వద్ద కొనసాగుతుంది.ప్రస్తుతం కిలో వెండి ధర రూ.85,400 వద్ద కొనసాగుతుంది.
ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,744 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,682 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,600లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70,470 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,400 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.79,000, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.85,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.85,400 లు ఉండగా, ఢిల్లీ లో రూ.82,100వద్ద ట్రెండ్ అవుతుంది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.