భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఇప్పడు కొన్నొళ్లకు పండగే.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: బంగారం అంటే భారతీయులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి పండగ, శుభకార్యాలకు పసిడి కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. ఇటీవల పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి.

Gold and Silver Rates: బంగారం అంటే భారతీయులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి పండగ, శుభకార్యాలకు పసిడి కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. ఇటీవల పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి.

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి ధరలు దారుణంగా పడిపోయాయి. ఏకంగా 4 రూపాల వరకు తగ్గడంతో బంగారం కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు చుక్కలు చూపించిన పసిడి ఏకంగా అంతగా తగ్గిపోవడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వం ఇదర దేశాల నుంచి దిగుమతి సుంకం తగ్గించడంతో పసిడి ధరల్లో భారీ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం పండగలు, శుభకార్యాలు మొదలయ్యాయి..ఈ సమయంలోనే పసిడి కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో ప్రస్తుతం పండగులు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సీజన్ మొదలైంది. మంగళవారం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పుణ్యమా అని పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇది మధ్యతరగతి కుటుంబీకులకు నిజంగా పండుగే. మొన్నటి వరకు అడ్డగోలుగా పెరిగిపోయిన ధరలు అమాంతం దిగి రావడంతో పసిడి కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. భవిష్యత్ లో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఇప్పుడే కొనిపెట్టుకుంటున్నారు. శనివారం (జులై 27) 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి 62,990కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి 68,720 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.62,990 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,720 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,140 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 68,870 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,140 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,970 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.62,990 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,720 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 88,900 ఉండగా, కోల్‌కొతాలో కిలో వెండి రూ.84,400, బెంగుళూరు లో రూ.84,150 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900 వద్ద కొనసాగుతుంది.

Show comments