ఎకరానికి రూ.7 వేల పెట్టుబడి.. రూ.47 వేలు లాభం! రైతులకు మేలు చేసే పంట

ఎకరానికి రూ.7 వేల పెట్టుబడి.. రూ.47 వేలు లాభం! రైతులకు మేలు చేసే పంట

తక్కువ పెట్టుబడితో పంట దిగుబడి అధికంగా వచ్చి ఎక్కువ రాబడి వచ్చే పంటలు చాలా ఉన్నా చాలా మంది రైతులకు అవగాహన లేక నష్టపోతున్నారు. అయితే ఈ పంట రైతుల పాలిట లాభాలు తెచ్చే సిరుల పంట. మరి ఆ పంట ఏమిటి? ఎలా వేయాలి? లాభాలు ఎలా వస్తాయి? వంటి వివరాలు మీ కోసం.

తక్కువ పెట్టుబడితో పంట దిగుబడి అధికంగా వచ్చి ఎక్కువ రాబడి వచ్చే పంటలు చాలా ఉన్నా చాలా మంది రైతులకు అవగాహన లేక నష్టపోతున్నారు. అయితే ఈ పంట రైతుల పాలిట లాభాలు తెచ్చే సిరుల పంట. మరి ఆ పంట ఏమిటి? ఎలా వేయాలి? లాభాలు ఎలా వస్తాయి? వంటి వివరాలు మీ కోసం.

రైతులు ఈ నేలను నమ్మి ఒక పంట మీద పెట్టుబడి పెడితే.. లాభం దేవుడెరుగు.. ఉన్న పెట్టుబడి మొత్తం పోతుంది. దీంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ఏ పంట వేసినా లాభం రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో లాభాలు తెచ్చే పంటల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎలాంటి పంట వేయాలి? ఏ పంట వేస్తే డిమాండ్ ఉంటుంది? ఏ పంటకు ఎంత దిగుబడి ఉంటుంది? దాని మీద ఎంత లాభం వస్తుంది? అనే వివరాలు మీ కోసం. 

కట్టె జనుము పంట

రైతులకు లాభాలు మిగిల్చే పంటల్లో కట్టె జనుము పంట ఒకటి. దీన్ని కొంతమంది కట్టి జనుము అని కూడా అంటారు. శాస్త్రీయ భాషలో క్రోటలారియా జాన్సియా అని, సన్ హెంప్ అని పిలుస్తారు. ఈ కట్టె జనుము పంటను శ్రీకాకుళం జిల్లా రైతులు ఎక్కువ మంది రబీ పంటగా సాగు చేస్తున్నారు. ఈ కొట్టే జనుము పంటకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది. భూమి సారాన్ని పెంచడం కోసం కట్టి జనుముని పచ్చి రొట్ట ఎరువుగా వాడతారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కట్టి జనుము గింజల నుంచి నూనె తీస్తారు. దీని నారను వివిధ వస్తువుల తయారీలో వాడతారు.

అయితే శ్రీకాకుళం రైతులు ఎక్కువగా దీన్ని విత్తనాల తయారీ కోసం పండిస్తున్నారు. ఈ పంట లేత దశలో ఉన్నప్పుడు పశువుల మేతగా కూడా వాడతారు. ఈ పంట వేయడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉండడం.. ఆదాయం ఎక్కువ రావడం వల్ల చాలా మంది రైతులు ఇటీవల కాలంలో కట్టి జనుము పంటను వేస్తున్నారు. ఈ పంట ఏ నేలలో అయినా పండుతుంది. ఈ కారణంగా రైతులకు ఈ పంట ఉత్తమ ఎంపికగా ఉంది.

పెట్టుబడి 7 వేలు, రాబడి 47 వేలు:

అయితే ఈ పంటకి నీరు తక్కువగా ఉండే నేలలు అయితేనే మంచిదని.. నీళ్లు ఎక్కువగా ఉంటే పంట దెబ్బతింటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పంట గాలిలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరణ చేస్తుంది. కాబట్టి దీని తర్వాత వేసిన పంట బాగా పండుతుంది. ఈ పంటను వరి పంట కోతకు ముందు అంటే నవంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకూ ఎప్పుడైనా వేసుకోవచ్చు. పొలంలో నీళ్లు పెట్టి.. నానబెట్టిన విత్తనాలను చిన్న మొలకలు వచ్చాక పొలంలో చల్లుకోవాలి. పెసలు, మినుములు ఎలా అయితే చల్లుతారో అలా విత్తుకోవాలి.

ఈ పంట వేయడానికి ఒక ఎకరానికి 15 కిలోల నుంచి 18 కిలోల విత్తనాలు అవసరం పడుతుంది. విత్తనాలను విత్తే ముందుగానే చీడపీడలు వంటివి రాకుండా మాంకోజాబ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పంట వేయడానికి ఎకరానికి రూ. 7 వేలు ఖర్చు అవుతాయి. ఎకరానికి 6 నుంచి 9 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఒక క్వింటాల్ 6 వేల రూపాయల చొప్పున అమ్ముకున్నా గానీ 9 క్వింటాళ్లకు 54 వేల రూపాయలు రైతు చేతికి వస్తాయి. ఖర్చు 7 వేలు తీసేయగా 47 వేలు లాభం వస్తాయని ఆమదాలవలసకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు.

Show comments