P Venkatesh
P Venkatesh
సొంత బైక్ లేని వారికి, బైక్ పై సవారీ చేయాలనుకునే వారికి ప్రముఖ బైక్ ల తయారీ కంపెనీ రాయల్ ఎన్ ఫీల్డ్ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ లను అద్దెకు ఇవ్వనున్నది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లంటే ఇష్టపడే వారు వీటిని రెంట్ కు తీసుకుని ఎంచక్కా రైడ్ కు వెళ్లొచ్చు. రీజనబుల్ రెంట్లతో ఈ రెంటల్ సర్వీస్ ను ప్రారంభించింది రాయల్ ఎన్ ఫీల్డ్. భారతదేశంలోని 25 నగరాలు, పట్టణాల్లో ఈ బైక్ రెంటల్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలో రాయల్ ఎన్ ఫీల్డ్ రెంటల్ సర్వీస్ ప్రారంభమైంది. మరి ఈ బైక్ లకు రెంట్ ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి? ఆ వివరాలు మీ కోసం..
రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లకు యూత్ లో ఉన్న క్రేజే వేరు. డుగు.. డుగు.. డుగు మంటూ వచ్చే సౌండ్ తో రోడ్లై జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంటారు బుల్లెట్ బైక్ లవర్స్. కాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో బైక్ రెంటల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కోసం 300 బైక్ లు అద్దెకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు 25 ప్రాంతాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్ని అద్దెకు తీసుకోవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ బైక్‌ను రెంట్‌కి తీసుకొని ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
అద్దెకు తీసుకోవడం ఎలా అంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను అద్దెకు తీసుకోవడానికి https://www.royalenfield.com/in/en/rentals/ వెబ్ సైట్ ను సందర్శించాలి. ఆ లింక్ లో కావాల్సిన సమాచారం నమోదు చేయాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న బైకుల వివరాలు కనిపిస్తాయి. ఆపరేటర్‌ని కాంటాక్ట్ చేసి బైక్ అద్దెకు తీసుకోవచ్చు. హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అద్దె వివరాలు చూస్తే క్లాసిక్ 350 మోడల్‌కు రోజుకు రూ.1000, థండర్‌బర్డ్ 500ఎక్స్ మోడల్‌కు రోజుకు రూ.1499, థండర్‌బర్డ్ 350ఎక్స్ మోడల్‌కు రోజుకు రూ.1199, థండర్‌బర్డ్ 350 మోడల్‌కు రోజుకు రూ.1199 చొప్పున అద్దె నిర్ణయించారు.