nagidream
Govt Will Make Another Film City In Hyderabad Says Revanth Reddy: ఇప్పటికే మహేశ్వరం ప్రాంతాన్ని మరో మహా నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లో మరో ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని వెల్లడించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమ షూటింగ్ ల కోసం ఇక్కడికే వస్తారని అన్నారు.
Govt Will Make Another Film City In Hyderabad Says Revanth Reddy: ఇప్పటికే మహేశ్వరం ప్రాంతాన్ని మరో మహా నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లో మరో ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని వెల్లడించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమ షూటింగ్ ల కోసం ఇక్కడికే వస్తారని అన్నారు.
nagidream
హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఎంత పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయో తెలిసిందే. దేశంలోని వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి మేకర్స్ వచ్చి ఇక్కడ షూట్ చేస్తారు. అయితే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీని తలదన్నేలా మరో ఫిల్మ్ సిటీని డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లాలో భారీ అభివృద్ధి పనులు చేపడతామని.. రాబోయే రోజుల్లో రంగారెడ్డికి మహర్దశ పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డిలో భూముల ధరలు బంగారం రేటు పలుకుతామని అన్నారు. మహేశ్వరం ప్రాంతాన్ని సైబరాబాద్ సిటీలా, న్యూయార్క్ సిటీలా మహానగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అలానే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఫిల్మ్ సిటీని మరొకదాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తామని అన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ ఉందని.. దేశంలో ఉండే సినిమా షూటింగ్ లకు ఉపయోగపడుతుందని.. అయితే ఇంకొక ఫిల్మ్ సిటీని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ముంబై, మహారాష్ట్రలో ఉన్న హిందీ సినీ పరిశ్రమ మొత్తం ఇక్కడకి రావాలని.. ఇక్కడ రాచకొండ గుట్టలు, మన ప్రాంతం షూటింగ్ కి అద్భుతంగా ఉంటాయని అన్నారు. మునుగోడు వెనుక ప్రాంతం, ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిల్మ్ సిటీ పక్క నుంచి తండాల నుంచి ఎన్నికల ప్రచారంలో వెళ్తే ఊటీ కంటే అద్భుతంగా ఉన్నాయని అన్నారు. రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు చేసుకునేందుకు అద్భుతమైన ప్రాంతంగా ఉంది అని అన్నారు. ముంబై నుంచి హిందీ సినీ పరిశ్రమను ఇక్కడకు రప్పించాలని.. రానున్న రోజుల్లో రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రానికి కొత్త టూరిస్ట్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఆయన చెప్పినట్టు జరిగితే కనుక రంగారెడ్డికి మహర్దశ పట్టడమే గాక మునుగోడు, రాచకొండ, ఇబ్రహీంపట్నం ఏరియల్లో కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఏరియాల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారికి ఫ్యూచర్ లో భారీ లాభాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.