పెట్టుబడి లేకుండా లక్షల్లో ఆదాయం.. టెర్రస్ ఖాళీగా ఉంటే చాలు!

పెట్టుబడి లేకుండా లక్షల్లో ఆదాయం.. టెర్రస్ ఖాళీగా ఉంటే చాలు!

వ్యాపారం చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. సరైన ఆలోచన వస్తే.. చాలు యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.

వ్యాపారం చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. సరైన ఆలోచన వస్తే.. చాలు యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.

వ్యాపారం చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. సరైన ఆలోచన వస్తే.. చాలు యువత బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకునే వారు. కానీ ట్రెండ్ మారింది.. చదువుకున్న తరువాత డబ్బులు సంపాదించడం కాదు.. కాలేజీ డేస్ నుంచి బిజినెస్ ను కెరీర్ గా మార్చుకుంటున్నారు. అలానే ఎంతో మంది యువత తమదైన ఆలోచనలతో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. వ్యాపారం చేయడం అంటే సరైన ప్రణాళి, డబ్బు, స్థలం అవసరం. అయితే మీకు  పెట్టుబడి లేకుండానే లక్షల్లో ఆదాయం వచ్చేలా ఒక ఐడియా ఉంది. కేవలం టెర్రస్ ఖాళీగా ఉంటే చాలు. మరి.. టెర్రస్ తో ఆదాయం ఎలా అంటారా?.  ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఏదైనా వ్యాపారం చేయడానికి సరైన ప్లాన్, డబ్బుతో పాటు పని చేయడానికి స్థలం అవసరమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో ఇంటి టెర్రస్‌ను వర్క్ స్పేస్‌గా ఉపయోగించవచ్చు. మీకు ఇంటి మిద్దెపై ఖాళీగా స్థలం ఉంటే చాలు.. మంచి ఆదాయం పొందవచ్చు. ట్రెర్రస్ స్పేస్‌ను అద్దెకి ఇచ్చి డబ్బులు సంపాదించ వచ్చు. అలానే మిద్దె వ్యవసాయం చేసి మరింత లాభం పొందవచ్చు. వేరే బిజినెస్ అవసరం లేకుండా ఖాళీ టెర్రస్ నుంచే సంపాదన కూడా పొందొచ్చు.

ఇంటి మిద్దెపై వ్యవసాయం చెయవచ్చు. మట్టితో నింపిన కుండలు లేదా సంచులను ఉపయోగించి.. టెర్రస్ పై కూరగాయాలు, పువ్వులను పెంచుకోవచ్చు.  ఈ మధ్యకాలంలో టెర్రస్ పై వ్యవసాయం చాలా పాపులర్ అయింది. పెద్ద స్థాయిలో పంట కోసం డీప్ కంటైనర్లు, రైజ్డ్ బెడ్స్ ఉపయోగించవచ్చు. దోసకాయ, టమాటా, క్యారెట్, ముల్లంగి, బీన్స్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి వివిధ రకాల కూరగాయలను పండించవచ్చు. ఇలా వీటిని అమ్మి కూడా ఆదాయం పొందవచ్చు.

అలానే ఇంటిపై ఉండే మిద్దెను మొబైల్ టవర్ల ఏర్పాటుకు ఇవ్వొచ్చు. మొబైల్ టవర్లు పెట్టడానికి టెర్రస్ స్థలాన్ని మొబైల్ కంపెనీలకు అద్దెకు ఇస్తే మంచి ఆదాయం వస్తుంది. దానికి ముందుగా స్థానిక అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతులు వచ్చాక టెలికాం కంపెనీలు లేదా టవర్ ఆపరేటర్లు మిద్దెను ఉపయోగించినందుకు నెల వారీ  అద్దెలు చెల్లిస్తాయి. ఇలా పెద్ద మొత్తంలో ఆదాయం అందుకోవచ్చు. చిన్న పట్టణాల్లో కూడా నెలకు రూ.60 వేల వరకు సంపాదించవచ్చు. ఇలానే ఇంటి మిద్దెపై సోలార్ ప్యానెల్స్ ను కూడా అమర్చి అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ప్రభుత్వం నుంచి సబ్బిడీలు, ఇంటికి ఉచిత విద్యుత్ పొందవచ్చు. అంతేకాక గ్రిడ్ ద్వారా ప్రభుత్వానికి లేదా ఇతర కంపెనీలకు ఎక్స్ ట్రా కరెంట్  ను విక్రయించవచ్చు. ఇలా నెలకు రూ.30 వేల నుంచి రూ. లక్ష వరకు సంపాదించ వచ్చు.

టెర్రస్ పై ఖాళీగా ఉంటే మరో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ మీ ఇల్లు చాలా మంది చూసే రద్దీ ప్రాంతంలో ఉంటే, హోర్డింగ్‌లు లేదా బ్యానర్లు పెట్టుకోవడానికి అద్దెకు  ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు. ఇక ఈ ప్రకటన ధర అనేది ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. మంచి ఒప్పందాల  కోసం యాడ్ ఏజెన్సీలతో కలిసి పని చేయవచ్చు. ఇలా కేవలం వీటి తోపాటు టెర్రస్ పై రెస్టారెంట్ లేదా కేఫ్ ను ప్రారంభివచ్చు. యోగా లేదా ఫిట్ నెస్ తరగతుల, అవుడోర్ థియేటర్ ఏర్పాటు వంటి ఇలా అనేక విధాలుగా టెర్రస్ ను వినియోగించుకుని లక్షల్లో ఆదాయం పొందవచ్చు. మరి.. ఈ వ్యాపారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments