PF ఖాతాదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. లక్షల మందికి లాభం!

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ డిపాజిట్ల వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. లక్షలాదిమంది ఉద్యోగులకు లాభం చేకూరనున్నది.

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ డిపాజిట్ల వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. లక్షలాదిమంది ఉద్యోగులకు లాభం చేకూరనున్నది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా సంస్థలు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు ఈపీఎఫ్ ఓ తోడ్పడుతుంది. ఉద్యోగి ప్రతి నెల తన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్ ఓ అకౌంట్లో జమ చేస్తారు. సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ డబ్బు ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ రూపంలో అందిస్తారు. ఈ క్రమంలో పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనున్నది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. గతంలో 8.15 శాతం ఉండగా దీన్ని 8.25 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వడ్డీ రేటు. దీంతో ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. 2023-24 మధ్యలో గానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న తమ సబ్ స్క్రైబర్లకు సవరించిన వడ్డీ ప్రకారమే చెల్లింపులు జరుపుతామని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.

సాధారణంగా ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటును ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత త్రైమాసికంలో ఖరారు చేస్తారు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్, జీపీఎఫ్, పీపీఎఫ్ వంటి పథకాలపై వడ్డీరేట్లకంటే ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు అధికం అని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ నిల్వలపై 8.15 శాతం వడ్డీని కేంద్రం నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫై చేసిన వడ్డీరేటు ప్రయోజనాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఫైనల్ సెటిల్మెంట్లు చేసుకుంటున్న సభ్యులందరికీ అదే వడ్డీ చెల్లిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇక ఇటీవల పీఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత సులభతరం చేస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Show comments