Dharani
Anant Ambani Wedding Gift To Friends: వివాహం సందర్భంగా అనంత్ చేసిన ఓ పని నెట్టింట సంచలనంగా మారింది. వారందరికీ కోట్ల ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చాడు అనంత్ అంబానీ. ఆ వివరాలు..
Anant Ambani Wedding Gift To Friends: వివాహం సందర్భంగా అనంత్ చేసిన ఓ పని నెట్టింట సంచలనంగా మారింది. వారందరికీ కోట్ల ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చాడు అనంత్ అంబానీ. ఆ వివరాలు..
Dharani
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు.. అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రోజుల క్రితం అనగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మన దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇక బాలీవుడ్ తారంలదరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. మన దగ్గర నుంచి కూడా రజనీకాంత్, రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున, నయనతార దంపతులు, అఖిల్ వంటి సెలబ్రిటీలు తరలి వెళ్లారు. వివాహం సందర్భంగా రజనీకాంత్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రాలు డ్యాన్స్‌తో అలరించారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లను గిఫ్ట్‌గా ఇచ్చాడు అంబానీ కుమారుడు. ఆ వివరాలు..
తన వివాహానికి హాజరైన స్నేహితులను అనంత్ అంబానీ విలువైన బహుమతులతో ముంచెత్తారు. ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి.. వారిని ఆశ్చర్యపరిచారు. పెళ్లి కొడుకు స్నేహితుల బృందానికి “ఆడెమర్స్ పిగ్వేట్” అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన వాచీని బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతిథులు వాళ్లకిచ్చిన లగ్జరీ గిఫ్ట్ హ్యాంప్లర్ల వీడియోలను షేర్ చేశారు. అనంత్‌కి బాలీవుడ్‌లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు.
వివాహం సందర్భంగా.. అనంత్ అంబానీ తన స్నేహితులకు లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన ‘అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్’ అనే వాచీనీ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్‌లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ఈ వాచీలో 41 ఎంఎం 18 క్యారట్ల పింక్ గోల్డ్ కేస్, 9.5 ఎంఎం మందంతో ఉంది. సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాక్, స్క్రూ లాక్ క్రోన్ ఉన్నాయి. ఇందులో పింక్ గోల్డ్ టోన్డ్ డయల్, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్ తో పొదిగిన గంటలకు సంబంధించిన మార్కింగ్, ప్రకాశవంతమైన కోటింగ్‌తో రాయల్ ఓక్ ముళ్లు ఉన్నాయి.
అంతేకాక ఈ గడియారంలో పింక్ గోల్డ్ టోన్డ్ ఉన్న ఇన్నర్ బెజెల్, మ్యానుఫ్యాక్చరింగ్ కాలిబర్ 5134 సెల్ఫ్-వైండింగ్ మూవ్మెంట్ ఈ వాచీకి ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా ఆటోమెటెడ్ వాచీ అన్నమాట. దీనిలో వారం, రోజు, తేదీ, ఖగోళ చంద్రుడి వివరాలు, నెల, లీప్ సంవత్సరం, గంటలు, నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ రావడం విశేషం. ఇది 40 గంటల బ్యాటరీ పవర్ రిజర్వ్ కలిగి ఉంది. 18 క్యారట్ల పింక్ గోల్డ్ బ్రాస్లెట్, ఎపి ఫోల్డింగ్ బకిల్, అదనంగా బ్లూ అలిగేటర్ స్ట్రాప్ కూడా ఈ వాచీకి వస్తుంది. 20 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లను ధరించి షారుక్, రణ్‍వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ గిఫ్ట్ గురించి తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు.